Ram pothineni : బాలయ్య డైలాగ్స్ తో బోయపాటిరాపో గ్లిమ్ప్స్.. హీరోకు లిమిట్స్ అస్సలు లేవుగా!

దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించారు బోయపాటి.

ఇకపోతే బోయపాటి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.బాలయ్య బాబు హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అఖండ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) తో సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Ram Pothineni Boyapati First Glimpse

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాస్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగే అవతారం మార్చుకున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

Advertisement
Ram Pothineni Boyapati First Glimpse-Ram Pothineni : బాలయ్య డ�

కానీ ఆ టీజర్ లో అసలు పేరు లేకుండా దర్శకుడు కాంబోలో బోయపాటి రాపో అనే వీడియోని విడుదల చేశారు.ఇలా విడుదల చేయడం మొదటిసారి.ఆ టీజర్ లో రామ్ పోతినేని పవర్ ఫుల్ లుక్స్ ని రివిల్ చేశారు.

Ram Pothineni Boyapati First Glimpse

ఆ వీడియోలో విలన్ ని ఛాలెంజ్ చేస్తూ నీ గేటు దాటా స్టేటు దాటా ఇంకా ఏంట్రా లిమిట్స్ అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగుని చూపించారు.ఒక్క ఫ్రేమ్ లో శ్రీలీలని చూపించగా, చుట్టూ రౌడీ గ్యాంగ్ తప్ప ఇంకెవరినీ ఓపెన్ చేయకుండా తెలివిగా కట్ చేశారు.రామ్ మునుపెన్నడూ చూడని ఊర మాస్ వేషంలో మోటుగా ఉన్నాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ టీజర్ లో హీరో రామ్ పోతినేని చెప్పిన డైలాగ్ బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ మాదిరిగానే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.నీ ఇంటికి వచ్చి నట్టింటికి వచ్చా అనే బాలయ్య డైలాగ్స్(Balakrishna ) ని పోలి ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాను అక్టోబర్ లో దసరా పండుగకు కానుకగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఏంటి అనేది ఇప్పటి వరకు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు బోయపాటి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే హీరోకు లిమిట్స్ లేనట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు