బండిసంజయ్ కొడుకుపై వర్మ సంచలన కామెంట్స్.. ఉదయ్ హూస్సేన్ అంటూ ట్వీట్.

తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మరింది.

అయతే అందులో బండి సంజయ్ కొడుకు భగీరథ్.

తోటి విద్యార్థిని బూతులు తిడుతూ.కొడుతున్నాడు.

ఆ సన్నివేశాన్ని.తోటి విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాంతో ఆ విడియో ప్రస్తుతం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది.తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న టైంలో బండి సంజయ్ కొడుకు వీడియో బయటకు రావడంతో.

Advertisement

అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఇక ఈ వీడియోను చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

అందరూ ఒక యాంగిల్ లో వీడియోను పోస్ట్ చేస్తే.వర్మ మాత్రం మరో కాంట్రవర్శిటీతో వచ్చారు.

ఏకంగా ఇరాక్ నియంత.సద్దాం హుస్సేన్ ను గుర్తు చేస్తూ.

ట్వీట్ చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను చూస్తుంటే.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

సద్దాం హుస్సేన్ కొడుకు గుర్తుకు వస్తున్నాడని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

ఈ వీడియోను చూస్తుంటే.ఇరాక్ లోని నియంత రోజులు ముగిసిపోయినట్టు కనిపించడం లేదని.తెలంగాణలో భగీరథ రూపంలో మరో ఉదయ్ హుస్సేన్ పుట్టాడని అనిపిస్తోందని కామెంట్ చేశాడు.

దాంతో ప్రస్తుతం ఈ ట్వీట్ అటు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ రంగంలోను సెగలు పుట్టిస్తోంది.మరి వర్మ మాటలను బీజేపీ నేతలు కొట్టిపారేస్తారా.? లేక ప్రతిదాడికి దిగుతారా చూడాలి.

ఇప్పటికే ఈ వీడియోపై బండి సంజయ్ స్పందించారు.పిల్లలు కొట్టుకుంటే.నాన్ బెయిలబుల్ కేసేంటని ప్రశ్నించారు.

పిల్లల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు.సీఎం కేసీఆర్ మనుమడిపై కామెంట్లు చేసినప్పుడు స్వయంగా తానే ఖండించానని గుర్తుచేశారు.

తాజా వార్తలు