రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్... అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న అల్లు అరవింద్!

రామ్ చరణ్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు.

అలాగే మరోవైపు వరుస సినిమాలతో రామ్ చరణ్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ యంగ్ హీరో మార్చి 17వ తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు.

ఇలా ఈ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఆలోచనలో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల పుట్టినరోజు వేడుకలలో సందర్భంగా వారి సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలను తిరిగి విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మార్చి 17వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకొనున్న నేపథ్యంలో ఈయన సినీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి మగధీర సినిమాను తిరిగి విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రెండో సినిమా అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనాలను సృష్టించింది.ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తిరిగి థియేటర్లలో విడుదల చేయడానికి గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున సన్న హాలు చేస్తున్నట్టు సమాచారం.అయితే త్వరలోనే ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇలా మగధీర సినిమా తిరిగి థియేటర్లలో విడుదల కాబోతున్నదనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?
Advertisement

తాజా వార్తలు