Ram Charan : వామ్మో ఈ చెవిటి పాత్ర చేయాలా అని కంగారు పడ్డారు రామ్ చరణ్..తర్వాత ఏమైంది?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత( Ram Charan, Samantha ) హీరో హీరోయిన్స్ గా నటించిన రంగస్థలం సినిమా దాదాపు ఈ చిత్రంలో నటించిన అందరికి కూడా బిగ్గెస్ట్ హిట్టుగా అనుకోవచ్చు.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ని హీరో గా అనుకోవడానికి ముందు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అప్పటికే ధ్రువ షూటింగ్ తో బిజీగా ఉన్న చరణ్ ని ఓసారి కలుద్దామని సుకుమార్ సెట్టుకు వెళ్లాడట.

అక్కడ సినిమా షూటింగ్లో ఉన్న రాంచరణ్ కి కలిసి సుకుమార్ తన సినిమా గురించి చెప్పాలనుకున్నాడట.కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ముందే రామ్ చరణ్ సుకుమార్ ని పలకరించి ఏంటి సుకుమార్( Sukumar ) నాతో సినిమా చేయడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏదైనా కథ ఉంటే చెప్పు.నేను చేయను అంటానా ? ఖచ్చితంగా నీ సినిమాలో నటించాలని ఉంది.నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే లాంటి కథలు ఏమైనా నా కోసం తీసుకురావచ్చు కదా అని సరదాగా అన్నారట.

అయితే తను కథ చెప్పడానికే వచ్చానని అలాంటి కథలు ప్రస్తుతం చేయడం లేదని అవి బోర్ కొట్టేసాయని ఒక విలేజ్ పొలిటికల్ డ్రామా స్క్రిప్ట్ సిద్ధం చేశానని నువ్వు ఒకసారి వింటే బాగుంటుంది అని చెప్పాడట సుకుమార్.దాంతో రంగస్థలం సినిమా కథను రామ్ చరణ్ కి చెప్పడానికి టైం తీసుకున్నాడట సుకుమార్.కొంత కథ విన్న తర్వాత తనకు హీరో చెవిటి వాడు అన్న విషయం తెలిసి కాస్త భయం వేసిందట.

పోయి పోయి ఇలాంటి

ఒక చెవిటి సినిమా పాత్ర

చేయడం తన కెరీర్ కి ఎలా ఉంటుందో అని భయపడ్డాడట రామ్ చరణ్.

Advertisement

అయితే క్లైమాక్స్( Climax ) తర్వాత వింటానని చెప్పి షూటింగ్ కి వెళ్ళిపోయాడట.కానీ మరుసటి రోజు ఖచ్చితంగా సుకుమార్ కి తను ఆ సినిమాలో నటించను అని చెప్పాలని నిర్ణయించుకున్నాడట.దానికన్నా ముందు ఓసారి కథ వింటే బాగుంటుందని పూర్తిగా క్లైమాక్స్ కూడా విన్నాడట.

కానీ మొత్తం విన్న తర్వాత తనకు ఆ కథ చాలా బాగా నచ్చిందట.ఎలా రిజెక్ట్ చేయాలి అనుకున్న సినిమాను సైతం సుకుమార్ నరేషన్ తో ఓకే చేశాడు రామ్ చరణ్.

ఆ తర్వాత చిరంజీవి సైతం కథ చాలా బాగుంది అని చెప్పడంతో అందరూ కలిసి మొత్తానికి సినిమా చేసేసారు.ఆ తర్వాత ఆ దాని ఫలితం ఏంటో మనందరికీ తెలిసిందేగా.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు