టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram charan Tej ) ఒకరు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతము ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక రాంచరణ్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే రకం అనే విషయం మనకు తెలిసిందే.ఈయన ఎవరి గురించి కూడా నోరు జారి పొరపాటున ఒక్క మాట అనరు ఎలాంటి వివాదాలకు వెళ్లరు.ఈయన ఎంతటి స్టార్ హీరో అయినా అంతే సింపుల్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే చరణ్ కొన్ని వేల కోట్లకు వారసుడు అయినప్పటికీ ఈయన కూడా మనలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కొన్ని వివిధ రకాల ఫోటోలను ఒకే ప్రేమ్ లో చేరుస్తూ ఈయనపై పలు మీమర్స్ పలు మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.రామ్ చరణ్ 2016 వ సంవత్సరం నుంచి 2024 వ సంవత్సరం వరకు ఒకే షర్ట్ వేసుకొని పలు సందర్భాలలో కనిపించారు.అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు అన్నింటిని ఒకే చోట చేరుస్తూ రామ్ చరణ్ గురించి పలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి వేసుకున్నటువంటి దుస్తులను మరోసారి వేసుకోవడానికి అసలు ఇష్టపడరు కానీ రామ్ చరణ్ మాత్రం ఇలా సంవత్సరాలుగా వేసుకోవడంతో ఈయన కూడా మన మిడిల్ క్లాస్ లాంటి అబ్బాయి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ ఫోటోపై ఎంతోమంది అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.బహుశా ఈ షర్ట్ ఉపాసన ( Upasana ) వదిన ప్రేమతో కానుకగా ఇచ్చిందేమో అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం కచ్చితంగా ఈ షర్ట్ రామ్ చరణ్ కు ఎవరు వాల్యుబుల్ పర్సన్ కానుకగా ఇచ్చి ఉంటారని అందుకే ఇన్ని సంవత్సరాలపాటు భద్రంగా దాచుకొని మరి వేసుకుంటున్నారు అంటూ వివిధ రకాలుగా రాంచరణ్ గురించి నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఒక స్టార్ హీరో ఇన్ని సంవత్సరాలుగా ఒక షర్ట్ వేసుకోవడం అంటే నిజంగా గ్రేట్ అని ఇది రాంచరణ్ సింప్లిసిటీకి నిదర్శనం అని కూడా చెప్పవచ్చు.
ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy