RC15 : ఆర్సీ15 అప్డేట్.. వాతావరణం దిల్ రాజు శంకర్ కి బాగానే కలిసొస్తోందిగా?

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డుని అందుకోవడంతో రామ్ చరణ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.దీంతో ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Ram Charan Shankar Rc15 Shooting Dil Raju Spending Huze Money

దిల్ రాజు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఇందులో చెర్రీ సరసన కియార అద్వానీ( Kiara Advani ) హీరోయిన్‌గా నటిస్తుండగా, జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.కాగా ఈ ఆర్సి15( RC15 ) సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

Advertisement
Ram Charan Shankar Rc15 Shooting Dil Raju Spending Huze Money-RC15 : ఆర్�

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతోంది.భారీ ఖర్చు చేసి వేసిన ప్రత్యేకమైన సెట్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు.

అయితే గత రెండు రోజులుగా భారీ వర్షాలు వచ్చినా కూడా ఈ సెట్ చెక్కుచెదరడం లేదట.

Ram Charan Shankar Rc15 Shooting Dil Raju Spending Huze Money

పైగా రాత్రి పూట మాత్రమే వర్షం పడటం, పగలు పడకపోవడం వల్ల ఆర్ధికంగా కూడా లాభం అవుతోందని అంటున్నారు.ఓపెన్ ఎయిర్ లో వేసిన ఈ భారీ సెట్ లో సాంగ్ షూటింగ్ కోసం చాలామంది టెక్నీషియన్స్ పని చేస్తున్నారట.భారీ వర్షం పడినా కూడా షూటింగ్ కి అంతరాయం లేకుండా ముందుకు వెళుతుండటం, అలాగే సెట్ చెక్కు చెదరకపోవడం దిల్ రాజు, శంకర్ అదృష్టం అంటూ చేస్తున్నారు.

లేదంటే వర్షం దెబ్బకి ఆ సెట్ కనకపోయి ఉంటే మళ్ళీ ఈ సెట్ వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది.దాంతో వాతావరణం దిల్ రాజు శంకర్ కు అనుగుణంగా ఉందని ఆ విషయంలో నిజంగా అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు