మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రజెంట్ లైనప్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్న విషయం తెలిసిందే.చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నాడు.
మరి ఈయన లైనప్ లో ఉన్న రెండు సినిమాల్లో ఒకటి బుచ్చిబాబు సానా ( Buchi Babu Sana ) ప్రాజెక్ట్.RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రజెంట్ చేస్తున్న సినిమా పూర్తి అయితే కానీ నెక్స్ట్ ఈ సినిమాను చరణ్ స్టార్ట్ చేయడు.ఆ సమయంలో బుచ్చిబాబు కూడా పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.
మరి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను కోనసీమ నేపథ్యంలో బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు అని టాక్.
ఇప్పటికే కథ అంతా సిద్ధంగా ఉందని కథలో చిన్న చిన్న మార్పులు మినహా అంతా సిద్ధమే అని తెలుస్తుంది.దీంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక RC16 సినిమాను యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో గేమ్ చేంజర్( Game Changer ) సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.ప్రజెంట్ ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy