రామ్ చరణ్ -పునీత్ రాజ్ కుమార్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా!

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ మల్టీస్టార్ర్ర్ చిత్రాల ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు సీనియర్ హీరో మరియు నేటి తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసేస్తున్నారు.ఇదంతా #RRR మూవీ ఇచ్చిన ధైర్యం అనే చెప్పాలి.

అయితే #RRR కి ముందే ఒక క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమా మిస్ అయ్యింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) కలిసి , ఒక మల్టీస్టార్ర్ర్ చిత్రం చేద్దాం అనుకున్నారు.

ఆ సినిమా మరేదో కాదు, రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ధ్రువ చిత్రం( Dhruva ).ఇందులో అరవింద్ గో స్వామి క్యారక్టర్ కోసం ముందుగా పునీత్ రాజ్ కుమార్ ని అనుకున్నాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

Ram Charan - Puneeth Rajkumar Combination Is The Movie That Was Missed , Puneeth
Advertisement
Ram Charan - Puneeth Rajkumar Combination Is The Movie That Was Missed , Puneeth

ముందుగా రామ్ చరణ్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా పునీత్ రాజ్ కుమార్ ని కాంటాక్ట్ చేసి అడిగేశాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ కి ఎంతో మంచి స్నేహితుడు.తన సొంత కుటుంబ సభ్యుడిలాగా చూస్తాడు, అందుకే రామ్ చరణ్ సినిమా అనగానే మరో మారు ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశాడట పునీత్ రాజ్ కుమార్.

ఈ విషయం రామ్ చరణ్ కి తెలిసిన తర్వాత ఆయన ససేమీరా ఒప్పుకోలేదట.ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ని నెగటివ్ రోల్ లో చూపిస్తే కర్ణాటక రాష్ట్రము మొత్తం అట్టుడికిపోతోంది, కన్నడ ప్రజల తాకిడిని తట్టుకోలేము అని సురేందర్ రెడ్డి కి చెప్పి, స్వయంగా పునీత్ రాజ్ కుమార్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడట రామ్ చరణ్.

దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిస్ అయ్యింది.

Ram Charan - Puneeth Rajkumar Combination Is The Movie That Was Missed , Puneeth

తనని అడగకుండా డైరెక్ట్ గా పునీత్ రాజ్ కుమార్ ని సంప్రదించినందుకు సురేందర్ రెడ్డి పై అప్పట్లో రామ్ చరణ్ ఫైర్ అయ్యినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.ఇక ఆ తర్వాత ఆ పాత్ర కోసం పలువురి హీరోలను సంప్రదించి, కుదరకపోవడం తో అరవింద్ గో స్వామిని తీసుకున్నారు.హీరో పాత్ర కంటే కూడా విలన్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మనం చూసాము.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇంత మంచి పాత్రని మిస్ చేసుకున్న హీరోలు నిజంగా దురదృష్టవంతులే అని చెప్పాలి.అయితే రామ్ చరణ్ ఆలోచన పునీత్ రాజ్ కుమార్ విషయం లో మాత్రం కరెక్ట్ అనే చెప్పాలి.

Advertisement

పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినీ పరిశ్రమ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి.ఆయనని అభిమానులు ఆరాధ్య దైవం లాగా భావిస్తారు, ఆయన చనిపోయిన తర్వాత కన్నడ ప్రజలు ఎలా తల్లడిల్లిపోయారో మన కళ్లారా చూసాము.

అలాంటి ఆదరాభిమానాలు ఉన్న హీరో ని నెగటివ్ రోల్ లో చూపించకపోవడమే మంచిది అయ్యింది.

తాజా వార్తలు