మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరితో ఒకరు సినిమాల పరంగా ఎంత పోటీగా ఉన్నప్పటికీ బయట మాత్రం మంచి స్నేహితులుగా మెలుగుతారు.
ఒకరి సినిమా గురించి మరొకరు కామెంట్స్ చేసుకుంటూ వారిపై ఎఫెక్షన్ ను చూపిస్తారు.
ఇక మన హీరోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహం గురించి చాలా మందికి తెలుసు.ఆర్ఆర్ఆర్ సినిమా సమయం నుండి వీరి స్నేహ బంధం బయటకు లీక్ అయ్యింది.
కానీ వీరు ముందు నుండి కూడా మంచి స్నేహితులు.వీరి స్నేహన్ని ఈ సినిమా మరింత స్ట్రాంగ్ గా చేసింది.
ఈ సినిమాలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించి ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించు కున్నారు.ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.
మన ఇండియన్ సినిమా గర్వించ దగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది.ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది.
హాలీవుడ్ లెవల్లో ఎందరో దర్శకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు.దీంతో పాటు హాలీవుడ్ లో వరుసగా పలు ప్రముఖ అవార్డులు అందుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక తాజాగా ఈ రోజు ఈ సినిమా ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ లో నాలుగు క్యాటగిరీల్లో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.
దీంతో పాటు మరో ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ ఇన్ యాక్షన్ మూవీ విభాగంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల పేర్లు కూడా హాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఉన్నాయి.ఈ నామినేషన్ కి సంబంధించి చరణ్ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ పోస్ట్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఆకట్టు కున్నాయి.
బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్, తాం క్రూయిజ్ లాంటి దిగ్గజ నటులతో నా బ్రదర్ ఎన్టీఆర్ పేరు.నా పేరు కలిపి చూడడం అనేది చాలా ఆనందంగా ఉందని చరణ్ పోస్ట్ చేసాడు.చరణ్ నుండి ఈ సంతోష కరమైన మూమెంట్ లో పోస్ట్ రావడంతో ఇటు మెగా అభిమానులే కాకుండా నందమూరి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇలా మరోసారి చరణ్ తమ ఫ్రెండ్షిప్ ను నిరూపించు కున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy