రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ రివ్యూ.. నానికి మాత్రం చరణ్ భారీ షాక్ ఇచ్చాడుగా!

రామ్ చరణ్( Ram Charan ) బుచ్చిబాబు( Buchibabu ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై( Peddi Movie ) ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

చరణ్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.వాస్తవానికి ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

ఈరోజు విడుదలైన పెద్ది గ్లింప్స్( Peddi Glimpse ) మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో కామన్ మ్యాన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పుడతామా ఏంటి మళ్లీ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

Ram Charan Peddi Movie Glimpse Review Details, Ram Charan, Peddi Movie , Peddi M
Advertisement
Ram Charan Peddi Movie Glimpse Review Details, Ram Charan, Peddi Movie , Peddi M

ఈ గ్లింప్స్ కు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ గ్లింప్స్ ఉంది.రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

ఉత్తరాంధ్ర యాసలో చరణ్ మెప్పించారు.రఫ్ లుక్ లో చరణ్ బాగున్నారు.

అయితే నానికి( Nani ) మాత్రం చరణ్ ఒకింత భారీ షాక్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Ram Charan Peddi Movie Glimpse Review Details, Ram Charan, Peddi Movie , Peddi M

2026 సంవత్సరం మార్చి 26వ తేదీన ది ప్యారడైజ్( The Paradise ) మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమాతో పోటీ నుంచి తప్పుకుంటుందేమో చూడాలి.పెద్ది సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తాడో చూడాల్సి ఉంది.

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

రామ్ చరణ్ ఒకింత వేగంగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చరణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు