ఢిల్లీ పార్లమెంటుకు రామ్ చరణ్.. ఈసారి ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Mega power star Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్ మూవీ ( game changer movie )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది.ప్రేక్షకులను అభిమానులను ఈ సినిమా భారీగా నిరాశపరిచింది.

ఇకపోతే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్సి 16( RC 16 ).ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

ఇటీవలే షూటింగుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా అధికారికంగా విడుదల చేశారు.

Advertisement

తన కూతురు క్లీంకారతో( Klinkara ) ఉన్న ఫోటోలను పంచుకున్నారు.ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్‌ లో రామ్ చరణ్‌ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్‌ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం.

ఢిల్లీలోని పార్లమెంట్‌ లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.అంతేకాకుడా జామా మసీదు ప్రాంతం లోనూ షూట్ చేయనున్నారని టాక్.

షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు కూడా తెలుస్తోంది.మార్చి 4న పార్లమెంట్‌ లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ సాధించాలని ఇటు బుచ్చిబాబు అలాగే అటు రామ్ చరణ్ గట్టిగానే కష్టపడుతున్నారు.

Advertisement

ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివరాజ్‌ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారట.

తాజా వార్తలు