Allu arjun Ram charan : రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య విబేధాలు.. అసలు మాటలు కూడా లేవనేదానికి ప్రూఫ్ ఇదే?

అదేంటి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ కి చెడిందా అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.

గత నెల అనగా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రామ్ చరణ్( Ram charan ) గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న మొదటి బర్త్డే కావడంతో చెర్రీ ఫాన్స్ బర్త్ డే ని ధూమ్ ధామ్ గా చేశారు.

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ నుంచి అభిమానులు, రామ్ చరణ్ కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Ram Charan Indirectly Conforms Differences With Hero Allu Arjun

అయితే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్( allu arjun ) కనీసం విష్ కూడా చేయలేదు.అంతేకాకుండా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఇంట్లో అదేరోజు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేయగా ఆ ఫంక్షన్ కి కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు.దాంతో అప్పటినుంచి చెర్రీ బన్నీకి మధ్య సఖ్యత లేదని ఇద్దరికీ చెడింది అంటూ వార్తలు ఊపందుకున్నాయి.

Advertisement
Ram Charan Indirectly Conforms Differences With Hero Allu Arjun-Allu Arjun Ram

ఇక తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చెర్రీ సోషల్ మీడియాలో హ్యాపీయెస్ట్ బర్తడే అల్లు అర్జున్ అని రాసుకొచ్చారు.అలాగే అక్కినేని అఖిల్ ( Akhil Akkineni )పుట్టినరోజు కావడంతో అఖిల్ కి కూడా బర్త్డే విషెస్ తెలిపారు రామ్ చరణ్.

Ram Charan Indirectly Conforms Differences With Hero Allu Arjun

అయితే చెర్రీ బర్త్డేకి అల్లు అర్జున్ కనీసం విష్ చేయలేదు.కానీ అల్లు అర్జున్ బర్త్ డేకి రామ్ చరణ్ విష్ చేశారు.అల్లు అర్జున్ కి బర్త్డే విషెస్ చెప్పగా అఖిల్ కి మాత్రం అఖిల్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ బర్త్డే విషెస్ చెప్పడంతో బన్నీ కి చెర్రీకు మధ్య వార్ నడుస్తోంది అనడానికి ఇది క్లియర్ ఇండికేషన్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ కి మించిన ఇంపార్టెన్స్ అఖిల్ కి చరణ్ ఇచ్చాడని ఆ ట్వీట్ ద్వారా అర్థం అవుతోంది.అల్లు అర్జున్ కి పొడిపొడిగా రెండు పదాల్లో విష్ చేసిన చరణ్ అఖిల్ ని డియరెస్ట్ అని సంబోధించడం అలాగే ఫోటో పంచుకోవడంతో చెర్రీ అల్లు అర్జున్ అభిమానుల మధ్య అసలైన వార్ మొదలైంది.

అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బన్నీ చెర్రీ అభిమానుల మధ్య కామెంట్స్ తో చిన్నపాటి యుద్ధం జరిగిందని చెప్పవచ్చు.చెర్రీ ఫ్యాన్స్ ముష్టి వేసాము తీసుకోండి అని కామెంట్స్ చేయగా పోస్ట్ చేయడానికి ఒక ఫోటో కూడా దొరకలేదా అని అల్లు అభిమానులు మండిపడుతున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు