రామ్ చరణ్( Ram Charan ) కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏదైనా ఉందీ అంటే ముందుగా మనకు "వినయ విధేయ రామ"( Vinaya Vidheya Rama ) సినిమానే గుర్తుకువస్తుంది.2019లో వచ్చిన ఈ మూవీని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ బాడీపై రకరకాల టాటూలతో కనిపిస్తాడు.
వాటిని చూస్తే మనకు మతిపోతుంది ఒక హాలీవుడ్ యాక్టర్ లాగా చెర్రీ మారిపోయాడని చెప్పుకోవచ్చు.అయితే ఈ టాటూలు వేయించుకునే సమయంలో రామ్ చరణ్ చాలా ఇబ్బందులు పడ్డాడట.
దాదాపు ఏడు రోజులపాటు 7 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో చరణ్ టాటూలు ( Tattoos )వేయించుకున్నాడట.ఏ టాటూలు వేయడానికి ఒక గంట, వాటిని తీయడానికి మరొక గంట సమయం పట్టేదట ఇలా రెండు గంటల పాటు షర్ట్ లేకుండా చలిలో వణుకుతూ చాలా కష్టపడ్డాడట.అంత కష్టపడి ఏం చేసినా ఈ సినిమా బాక్సాఫీస్ బాంబుగా నిలిచింది ఈ మూవీలో కథే లేదు.
బోయపాటి శ్రీనివాస్ ఎలాంటి పసలేని స్టోరీ తో రామ్ చరణ్ నిండా ముంచాడనే చెప్పుకోవాలి.రామ్ చరణ్ తన పాత్ర కోసం పెట్టిన ఎఫెక్ట్స్ లో కనీసం ఐదు శాతం బోయపాటి శ్రీను కథ పై పెట్టిన ఈ మూవీ హిట్ అయ్యేదేమో.
ఈ సినిమా ఫెయిల్ కావడం తర్వాత చరణ్ అభిమానులకు ఒక క్షమాపణలు లేఖ కూడా రాశాడు.
బోయపాటి బాలకృష్ణ కాంబోలో వచ్చే సినిమాలు హిట్ అవుతాయేమో కానీ మిగతావన్నీ ఊహించని రీతిలో ఫ్లాప్స్ అవుతాయి అందుకే ఆ దర్శకుడితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు భయపడిపోతుంటారు.రామ్ పోతినేని కూడా బోయపాటి శ్రీను నమ్మి స్కంద సినిమాతో దెబ్బ అయి అయిపోయాడు.మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని బోయపాటి శ్రీను తో ప్లాన్ చేశాడు.
అది యాక్షన్ సినిమా గా వస్తుందా లేదా అనేది తెలియ రాలేదు.అల్లు అర్జున్ 23వ సినిమా, పవన్ కళ్యాణ్ 33వ సినిమా కూడా బోయపాటి దర్శకత్వంలో రావడం విశేషం.
తమిళ హీరో సూర్యతో కూడా బోయపాటి ఒక మూవీ తీస్తున్నాడు.ఇవన్నీ ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇప్పుడు దర్శకుడు శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy