గేమ్‌ ఛేంజర్‌ ‘దోప్‌’ సాంగ్‌ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) న‌టించిన భారీ అంచ‌నాల‌తో నిండిన చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్’.

( Game Changer ) శంక‌ర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకులలో గొప్ప అంచ‌నాలను పెంచింది.

కియారా అద్వాణి( Kiara Advani ) కథానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.‘గేమ్ ఛేంజర్’ తెలుగు, తమిళ, హిందీ భాషలలో సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవుతుంది.

చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగంగా ముందుకు సాగుతుంది.ఇప్పటికే విడుదలైన ‘రా మచ్చా మచ్చా’, ‘నా నా హైరానా’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.

Ram Charan Game Changer Movie Dhop Song Lyrical Out Now Details, Dhop Song, Lyri

తాజాగా, ఈ చిత్రం నుంచి నాలుగో పాటగా ‘దోప్’ లిరికల్ సాంగ్‌ను( Dhop Lyrical Song ) విడుదల చేశారు.ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వాణి జంట చేసిన డ్యాన్సింగ్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.ఈ పాట రామజోగయ్య శాస్త్రి అందించగా, సంగీతంను తమన్ అందించారు.

Advertisement
Ram Charan Game Changer Movie Dhop Song Lyrical Out Now Details, Dhop Song, Lyri

తమన్, రోషిణి, పృథ్వీ, శ్రుతి రంజని ఈ పాటను ఆలపించారు.ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాటను కంపోజ్ చేశారు.

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది.

Ram Charan Game Changer Movie Dhop Song Lyrical Out Now Details, Dhop Song, Lyri

‘దోప్’ సాంగ్ తో గేమ్ ఛేంజర్ సినిమాకు జోష్ రెట్టింపు అయింది.ఈ పాట నిజంగా గేమ్ ఛేంజర్ గా మారిపోతుంది.మెగా ఫ్యాన్స్‌లో ఈ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవనున్న భారీ చిత్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒక ప్రధాన చిత్రం.ఇందులో కియారా అద్వాణి కథానాయికగా నటిస్తుండగా, అంజలి మరో కీలక పాత్రలో కనిపించనుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇక, గేమ్ ఛేంజర్ చిత్రం నార్త్ ఇండియా థియేటర్ రైట్స్ ను అనిల్ తడాని AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు