మెగాస్టార్ వల్ల కన్నీళ్లు పెట్టిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు తనయుడు రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.

ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా, చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నరు.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిట్ చాట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ సెట్ లో తన తండ్రితో కలిసి నటించిన అనుభవాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను నటించడమే కాకుండా సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ప్రతి నిమిషం కూడా తాను తన తండ్రితో కలిసి ఉండటం అనేది తనకు బాగోద్వేగపూరితమైనది అని తెలిపాడు రామ్ చరణ్.అంతేకాకుండా తన తండ్రిలి తనకు వీలుగా ఉండే విధంగా ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇచ్చారని, ఆ ఇంట్లో దాదాపుగా 20 రోజులు ఉన్నాము అని తెలిపాడు.

Advertisement

ఆ ఇరవై రోజుల పాటు తాను తన తండ్రి కలిసి ఉదయాన్నే లేచి వర్కవుట్ చేసి,తిని ఆ తరువాత షూటింగ్ కు వెళ్లే వాళ్లం అని చెప్పుకొచ్చాడు చరణ్.

రోజు కలిసి షూటింగ్ కు వెళ్లడమే కాకుండా అక్కడ ఇద్దరు సెట్ లో కలిసి పని చేసే వాళ్ళం అని తెలిపాడు చెర్రీ.షూటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు తిరిగి ఒకే కారులో వచ్చేవాళ్ళం అని తెలిపాడు.అయితే తన తండ్రి తో గడిపిన క్షణాలు అన్ని కూడా తనకు ఎంతో మధురమైన అని చెప్పుకొచ్చాడు చెర్రీ.

అయితే ఒకరోజు చిరంజీవి రామ్ చరణ్ తో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడట.చరణ్ దీని వ్యాల్యూ నీకు అర్థం కావడం లేదేమో.ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశాలు రావు.

కానీ ఆచార్య సినిమా వల్ల మనకు ఇలాంటి మంచి అవకాశం వచ్చింది.షూటింగ్ కి ముందు తర్వాత ఇలా ప్రతి ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేద్దాం.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

అంతేకాకుండా ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారి మనకు కుదరదు అని చరణ్ ను చిరంజీవి హత్తుకోవడం తో చరణ్ ఎమోషనల్ అయ్యాడట.

Advertisement