మళ్లీ అదే పాత్రలో కనిపిస్తున్న చరణ్.. అయోమయంలో ఫ్యాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారఅ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో నటిస్తుండగా, చరణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే మనకు తెలుస్తోంది.

Ram Charan To Play Police Once Again, Ram Charan, Dhruva, RRR, Ramaraju, Tollywo

గతంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చాలా చిత్రాల్లో నటించాడు.ఇప్పుడు రామరాజు పాత్రలోనూ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపిస్తున్నాడు.

అయితే చరణ్ నెక్ట్స్ మూవీలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో ఓ పాపను ఆస్తి కోసం కొందరు దుండగులు వెంటాడుతుండగా, వారి నుండి ఆ పాపను కాపాడే పోలీస్ అధికారి పాత్రలో చరణ్ కనిపిస్తాడట.

Advertisement

మొత్తానికి చరణ్ వరుసగా పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.గతంలోనూ చరణ్ పోలీస్ పాత్రల్లో నటించిన చిత్రాలు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు.

మరి ఈసారి ఈ పాత్రల్లో నటిస్తున్న చరణ్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడా అనేది సందేహంగా మారింది.కాగా చరణ్ ప్రసుతం ఆర్ఆర్ఆర్‌లో నటిస్తుండటంతో పాటు తన తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

తాజా వార్తలు