బిడ్డ ఎవరి పోలికో రివీల్ చేసిన రామ్ చరణ్.. పేరు కూడా ఫిక్స్ చేశామంటూ?

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )బిడ్డ చరణ్ పోలికా? ఉపాసన పోలికా? అనే ప్రశ్న వ్యక్తమవుతుండగా తాజాగా ఆ ప్రశ్నలకు సంబంధించి రామ్ చరణ్ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చింది.

చరణ్ ఉపాసన( upasana ) దంపతుల కూతురుకు పేరు కూడా ఫిక్స్ అయిందని అతి త్వరలో ఆ పేరుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుందని రామ్ చరణ్ కామెంట్ల ద్వారా వెల్లడైంది.

ఈరోజు ఉపాసన డిశ్చార్జ్ అయ్యారు.రామ్ చరణ్ మాట్లాడుతూ అపోలో వైద్యులు( Doctors of Apollo ) ఉపాసనను, పాపను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు.

అపోలో వైద్యులకు పేరుపేరునా ధన్యవాదాలు అని చరణ్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ అని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

అభిమానులు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు సైతం రావడం లేదని చరణ్ అన్నారు.అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని భావిస్తున్నానని చరణ్ వెల్లడించారు.బిడ్డ నా పోలిక అని రామ్ చరణ్ అన్నారు.

ఒక తండ్రిగా ఇంతకు మించిన సంతోషం ఉండదని రామ్ చరణ్ వెల్లడించారు.నాన్న చాలా సంతోషంగా ఉన్నారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

పాప పుట్టినా బాబు పుట్టినా ఏ పేరు పెట్టాలో ముందే ఫిక్స్ అయ్యామని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.ఆ పేరును ఇప్పుడే చెప్పలేనని పేరు పెట్టే రోజు స్వయంగా నేనే వెల్లడిస్తానని రామ్ చరణ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు