ఒకరి కెరీర్ ను ఒకరు చక్కబెట్టుకుంటున్న మెగా ఫాదర్ అండ్ సన్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను ఆయన తనయుడు రామ్ చరణ్.రామ్ చరణ్ కెరీర్ ను ఆయన తండ్రి మెగాస్టార్ చక్కబెడుతున్నారు? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది.

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు చూసి అందరు ఇదే అర్ధం చేసుకుంటున్నారు.

ట్రిపుల్ ఆర్ తో ఘన విజయం అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత తన లైనప్ లో కొత్తగా ఆలోచిస్తున్నాడు.అలాగే ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు.

ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్న చిరును మళ్ళీ ట్రాక్ లోకి తీసుకు వచ్చి మెగాస్టార్ అంటే ఏంటో అందరికి రుజువు చేయడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చరణ్ లైన్లో పెట్టించాడు.తన కెరీర్ మాత్రమే కాదు తండ్రి కెరీర్ ను కూడా చక్కబెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.

గాడ్ ఫాదర్ రీమేక్ హక్కులను కూడా చరణ్ తీసుకోవాలి అనుకున్నాడు అని చిరు చెప్పిన విషయం తెలిసిందే.లూసిఫర్ రీమేక్ ను జాగ్రత్తగా తెరకెక్కించి సక్సెస్ కొట్టారు.

Advertisement

ఇక ఇప్పుడు తండ్రి కోసం మరొక మలయాళ రీమేక్ మూవీ రైట్స్ ను చరణ్ కొనుగోలు చేసినట్టు టాక్ వస్తుంది.మమ్ముటి ప్రధాన పాత్రలో నటించిన భీష్మ పర్వం సినిమాను తండ్రితో రీమేక్ చేయాలని చరణ్ ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు టాక్.

ఇక చరణ్ చిరు కోసం జాగ్రత్తలు తీసుకుంటూనే తన కెరీర్ గురించి కూడా ఆచితూచి అడుగులు వేయడంలో తండ్రి చిరు సహాయం తీసుకుంటున్నాడు.

చిరు కూడా చరణ్ కు సహకరిస్తు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు.ప్రెజెంట్ చరణ్ ఆర్సీ15 సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.తన తదుపరి సినిమాను గౌతమ్ తిన్ననూరి తో చేయాలని అనుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి వేరే డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

మరి ఆ ప్రాజెక్ట్ వివరాలు కూడా త్వరలోనే రాబోతున్నట్టు తెలుస్తుంది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement