రామ్ చరణ్ - బుచ్చిబాబు మూవీ.. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )చేతిలో ప్రస్తుతం క్రేజీ లైనప్ ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ ఆ రేంజ్ కు తగ్గట్టుగానే కథలను ఎంచుకుంటూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూట్ చివరి స్థాయికి చేరుకుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు కానీ వచ్చే ఏడాది జనవరిలో వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే RC16 సినిమాపై గత కొన్ని రోజులుగా ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా ఈ సినిమా నుండి మరొక వార్త వైరల్ అయ్యింది.

Advertisement

RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు సానా( Buchi Babu Sana ) డైరెక్ట్ చేయనున్నాడు.ఉప్పెన సినిమాతో భారీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ తో సినిమా ప్రకటించడం ఆసక్తిగా మారింది.ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఏంటంటే.

గత కొన్ని రోజులుగా బుచ్చిబాబు చరణ్ తో చేసే సినిమా కథ ఎన్టీఆర్( Jr ntr ) కు చెప్పిన కథ అని టాక్ వస్తుంది.

దీనిపై క్లారిటీ ఇస్తూ.చరణ్ కు చెప్పిన కథ వేరు.ఎన్టీఆర్ కు చెప్పిన కథ వేరు అని చరణ్ కోసం బుచ్చిబాబు కొత్త స్క్రిప్ట్ రెడీ చేసి తెరకెక్కిస్తున్నాడు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

దీంతో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.ఇక RC16 సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు