రామ్ చరణ్ ఇంకా ఆస్కార్ మూడ్ నుండి బయటకు రావడం లేదా ఏంటి!

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ఆర్ఆర్‌ఆర్‌( RRR ) చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు.

అయితే కొందరు ఇప్పటికే తమ పనుల్లో బిజీ అయ్యారు.

నెల రోజుల పాటు అమెరికాతో పాటు పలు దేశాల్లో ఆర్ఆర్‌ఆర్ టీమ్‌ హడావుడి కొనసాగింది.రామ్‌ చరణ్‌ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికా వెళ్లి అక్కడ ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకలో పాల్గొన్న విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ కాస్త ఆలస్యంగా వెళ్లాడు.అంతే కాకుండా అందరి కంటే ముందే తిరిగి వచ్చాడు.

ఇటీవలన తన ఎన్టీఆర్30( NTR30 ) సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న విషయం తెల్సిందే.ఈనెల చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఇక రాజమౌళి( Rajamouli ) ఎప్పటి నుండి వర్క్ ను మొదలు పెట్టబోతున్నాడు అనే విషయమై క్లారిటీ లేదు.అయితే రామ్‌ చరణ్ మాత్రం వెంటనే షూటింగ్ లో జాయిన్‌ అవ్వాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు.

శంకర్ దర్శకత్వంలో సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యిందనే విషయం కూడా తెల్సిందే.ఆస్కార్‌ అవార్డు( Oscar Award ) వేడుక నుండి వచ్చిన వెంటనే షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటాడని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.కానీ రామ్ చరణ్ ఇంకా కూడా ఆస్కార్‌ మూడ్ నుండి బయటకు వచ్చినట్లుగా లేడు.

అందుకే శంకర్ దర్శకత్వంలో సినిమాను పక్కకు పెట్టారనే విమర్శలు వస్తున్నాయి.పెద్ద ఎత్తున శంకర్ దర్శకత్వంలో ప్లాన్‌ చేసిన షెడ్యూల్‌ ను క్యాన్సల్‌ చేయడం జరిగిందట.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.వచ్చే నెలలో ఆ షెడ్యూల్‌ ఉంటుందట.

Advertisement

ఆ షెడ్యూల్‌ వరకు అయినా రామ్‌ చరణ్‌ ఆస్కార్ మూడ్ నుండి బయటకు వస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు