చరణ్‌ 'తుఫాన్‌' తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి చిత్రం

రామ్ చరణ్‌ కెరీర్‌ ఆరంభంలో హిందీలో జంజీర్ సినిమాను చేశాడు.ఆ సినిమా తెలుగు లో తుఫాన్‌ గా వచ్చింది.

ఆ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా ఒకే సారి తెరకెక్కించారు.రెండు భాషల్లో వేరు వేరుగా చిత్రీకరించడం జరిగింది.

రెండు భాషల్లో ఇద్దరు దర్శకులు వర్క్‌ చేశారు.కొన్ని సన్నివేశాలను రెండు భాషలకు విడి విడిగానే చిత్రీకరించారు.

కాని రెండు భాషల్లో కూడా ఆ సినిమా ఫలితం సాధించలేక పోయింది. క్లాసిక్ సినిమాను రీమేక్ చేసి చెడగొట్టారు అంటూ చరణ్‌ పై విమర్శలు వ్యక్తం అయ్యాయి.

Advertisement
Ram Charan And Shankar Movie Shoot In Three Language, Fil News , Ram Charan , Sh

అప్పట్లో చెత్త సినిమా అవార్డ్‌ అంటూ జంజీర్ కు ఇవ్వడం కూడా జరిగింది.అప్పటి నుండి బాలీవుడ్‌ అంటే చరణ్‌ కు ఆసక్తి లేకుండా పోయింది.

అందుకే ద్వి భాష చిత్రాలను ఇప్పటి వరకు చేయలేదు.కాని చరణ్‌ ఇప్పుడు చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా అక్కడ విడుదల అయ్యి స్టార్‌ గా నిలువబోతున్నాడు.

మరో సారి చరణ్‌ ఒకే సారి మూడు భాషల్లో ఒకే సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.తుఫాన్‌ ను రెండు భాషల్లోనే చేసిన చరణ్‌ ఇప్పుడు ఏకంగా మూడు భాషల్లో శంకర్‌ సినిమాను చేయబోతున్నాడు.

మూడు భాషలకు కొన్ని సీన్స్ ను ప్రత్యేకంగా చిత్రీకరిస్తారట.ముఖ్యంగా నటీ నటుల విషయంలో కూడా మూడు భాషలకు వేరు వేరు ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఈమద్య కాలంలో ఇలా వేరు వేరు నటీనటులతో షూటింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.మూడు భాషలకు మూడు రకాలుగా సీన్స్‌ ను డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

Advertisement

అన్ని భాషలకు కూడా శంకర్‌ దర్శకత్వం వహిస్తాడు.కాని తెలుగు మరియు హిందీ భాషల్లో చేసే సన్నివేశాలకు సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్స్ కీలకంగా వ్యవహరించబోతున్నారు.

వారు ఆయా భాషలకు సంబంధించిన ప్రత్యేక సన్నివేశాలను శంకర్‌ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తారట.

ఇప్పుడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న శంకర్‌ సినిమా కు తెలుగు వర్షన్‌ కు సాయి మాధవ్‌ బుర్ర మాటలు అందించబోతున్నాడు.తమిళ వర్షన్‌ కు కొన్ని సీన్స్ అదనంగా ఉంటాయి కనుక మరో మాటల రచయిత కూడా పని చేస్తాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.మొత్తానికి జంజీర్ తర్వాత ఇన్నాళ్లకు చరణ్‌ త్రి భాష సినిమాను చేయబోతున్నాడు.

తాజా వార్తలు