చరణ్ కోసం బుచ్చిబాబు ఆ ఇద్దరిలో ఎవరిని సెట్‌ చేస్తాడో!

రామ్‌ చరణ్‌( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో గేమ్‌ ఛేంజర్ అనే సినిమా లో కనిపించబోతున్నాడు.

ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ తో సినిమా ను చేసేందుకు రామ్‌ చరణ్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.

మొదటి సినిమా ఉప్పెన( Uppena )తో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బుచ్చి బాబు రెండవ సినిమా తోనే ఏకంగా రామ్‌ చరణ్ తో సినిమా ను చేసే అవకాశం ను దక్కించుకున్నాడు.ఈ నేపథ్యం లో రామ్‌ చరణ్ కోసం దర్శకుడు బుచ్చి బాబు చాలా ప్లాన్‌ చేస్తున్నాడు.

రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer ) లో హీరోయిన్‌ గా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే.మరి బుచ్చి బాబు ఎవరిని చరణ్ కోసం తీసుకు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యం లో మీడియా లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు.

పుకార్లు షికార్లు చేస్తున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కి గాను ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Advertisement

అవి ఏంటి అంటే రామ్ చరణ్‌ కి జోడీగా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.అది మాత్రమే కాకుండా శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

తెలుగు అమ్మాయిలతో వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను.కనుక తెలుగు అమ్మాయి అయిన శ్రీ లీల( Sreeleela )తో తాను వర్క్ చేస్తాను అంటూ ఆ మధ్య ఒక ఈవెంట్‌ లో బుచ్చిబాబు పేర్కొన్నాడు.కనుక రామ్ చరణ్‌ కోసం కచ్చితంగా శ్రీ లీలను బుచ్చి బాబు( Director Buchi Babu ) ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది.

ఈ ఏడాది చివర్లోనే సినిమా ను మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో లేదా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు