ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఐటెం సాంగ్ లో డాన్స్ చేయనున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం ఎన్టీఆర్.బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు.

యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి.వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న మూవీ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.చంద్రబాబు గా రానా పోస్టర్, అక్కినేని నాగేశ్వర రావు గా సుమంత్ పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.

సావిత్రిగా కీర్తి సురేష్, జయప్రదగా రాశి ఖన్నానటిస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా.ఈ చిత్ర యూనిట్ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ను కలిశారంట.ఈ సినిమాలో ఓ ఐటెం పాటలో రకుల్ కనిపించనుంది అంట.ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.కాగా, కలర్ మూవీస్ వచ్చాక ఎన్టీఆర్‌ సినిమాల్లోని చాలా ఐటెమ్‌ సాంగ్స్ సూపర్‌ హిట్‌గా నిలిచాయి.

దీంతో.ఏ పాటలో రకుల్‌ప్రీత్ అలరిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు