పాన్ ఇండియా మూవీ చేస్తున్న రష్మిక మాజీ లవర్

కన్నడ నాట కిరికి పార్టీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రక్షిత్ శెట్టి.

ఆ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్న రక్షిత్ శెట్టి అందులో తనతో కలిసి నటించిన రష్మికతో ప్రేమలో పడి నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.

వారి ఎంగేజ్ మెంట్ తర్వాత రష్మిక చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం, సక్సెస్ అందుకోవడ జరిగింది.తరువాత గీతాగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Rakshith Shetty Sets Pan India Movie With 777 Charlie, Tollywood, Sandalwood, Ra

వరుస అవకాశాలని తెలుగులో సొంతం చేసుకుంది.ఇందులో అప్పటి వరకు పెళ్లి చేసుకుంటారని భావించిన రక్షిత్ శెట్టి, రష్మిక మందన తన బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.రష్మిక కెరియర్ పరంగా మరింత బెస్ట్ గా ఎదగడానికి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని టాక్ వినిపించింది.

Advertisement

ఆ సమయంలో కన్నడ అభిమానులు రష్మిక మీద తీవ్ర విమర్శలు కూడా చేశారు.అయితే ఆ ప్రేమ, పెళ్లి బంధాన్ని వదులుకున్న తర్వత రష్మిక ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో వరుసగా మూడు సినిమాలతో పాగా వేయడానికి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే రష్మిక లవర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన రక్షిత్ శెట్టి తరువాత తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

అతని సినిమాలని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.శ్రీమన్నారాయణ అనే కామెడీ, కాప్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ మూవీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో ఒక ప్రాజెక్ట్ తో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.777 చార్లీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ని తాజాగా లాంచ్ చేశారు.ఇందులో రక్షిత్ శెట్టితో పాటు ఓ కుక్క కీలక పాత్ర పోషిస్తుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

కిరణ్ రాజ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.తెలుగు టీజర్ ని నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు.

Advertisement

చార్లీ అనే కుక్క, ధర్మ అనే హీరో పాత్ర కలిసి చేసిన జర్నీగా ఈ మూవీ కథాంశం ఉండబోతుందని టీజర్ బట్టి తెలుస్తుంది.మరి ఈ మూవీతో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు