ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాం.హైదరాబాద్ ఐటి ఉద్యోగాలకు కేంద్రబిందువుగా మారుతోంది.
గూగుల్, ఆపిల్ నుంచి ఏరినాటిక్స్ ఇంజనీరింగ్ కంపెనీల వరకు, భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే మొదట హైదరాబాద్ వైపే చూస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు.పన్ను వసూళ్ళు కూడా అత్యధికంగా పెరిగిన రాష్ట్రం తెలంగాణ.
మరి ఇన్ని విజయాలకు, అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భణకు కారణం ఎవరు అంటే ఇంకెవరు కేసిఆర్ అని గొంతెత్తి చెబుతారు తెలంగాణ ప్రజలు.దశాబ్ద కాలానికి పైగా ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ తెప్పించి, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.
ఆ పనితనం ఉంది కాబట్టే, తెలంగాణలో టీఆర్ఎస్ కి పోటినివ్వగలిగే పార్టీ లేదు, కేసిఅర్ పవర్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని తట్టుకోగలిగే లీడర్ లేడు.మరి అలాంటి నాయకుడి జీవిత చరిత్ర మీద సినిమావాళ్ళకి ఆసక్తి పుట్టుకుండా ఉంటుందా? కేసిఆర్ జీవితచరిత్ర మీద సినిమా తీయనున్నట్లు గత ఏడాదే ప్రకటించారు దర్శకనిర్మాత మధుర శ్రీధర్.పెళ్ళి చూపులు వంటి భారీ బ్లాక్ బస్టర్ ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారు.
ఇన్నిరోజులుగా కేసిఆర్ గా సరిపోయే నటుడు ఎవరు? అలాంటి ముఖకవళికలు ఎవరికున్నాయి అని తెగా ఆలోచించారు దర్శకనిర్మాతలు.మొత్తానికి ఓ ఐదారు నెలల శ్రమ తరువాత వారికి రీల్ లైఫ్ కేసిఆర్ దొరికినట్లుగా సమాచారం.
బాలివుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తెలుసా? ఇప్పుడు శృతి హాసన్ తో "బెహన్ హోగి తేరి" సినిమా చేస్తున్నది ఈ కుర్ర నటుడే.అచ్చుగుద్దినట్లు కేసిఆర్ లా ఉండడు కాని, కొంచెం ఆ ముక్కు అలానే ఉంటుంది.
మేకోవర్ చేస్తే కేసిఆర్ కి దగ్గరగా కనిపించేలా చేయవచ్చు.పైగా మంచి నటుడు, ఎంతోకొంత బాలువుడ్ మార్కేట్ కూడా దొరుకుతుంది.
అందుకే రాజ్ కుమార్ రావునే ఫిక్స్ చేసుకున్నట్లు టాక్.ఈ కేసిఆర్ బయోపిక్ కి హిందీలో గులాల్ (గులాబి) అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది 17 ఫిబ్రవరిన కేసిఆర్ పుట్టినరోజు కానుకగా సినిమాని విడుదల చేస్తారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy