'తలైవర్ 170' షూట్ స్టార్ట్.. మరింత యంగ్ గా సూపర్ స్టార్.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీ కాంత్( Rajinikanth ) గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.70 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి ఈయన వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.

ఇటీవలే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది.

చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది.కొన్నేళ్లుగా ఫామ్ కోల్పియిన సూపర్ స్టార్ కు ఆయన రేంజ్ హిట్ దక్కింది.ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

అందులో ఈయన 170వ సినిమా ఒకటి.ఈ సినిమా తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.

రజనీకాంత్ జై భీమ్ డైరెక్టర్ టి జి జ్ఞ్యానవేల్( T J Gnanavel ) దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నారు.ప్రకటన తోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Advertisement

లైకా ప్రొడక్షన్స్ వారు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫిక్స్ అయ్యాడు.అలాగే చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో భాగం అయ్యారు.

ఇప్పటికే వీరిని అఫిషియల్ గా ప్రకటించారు.ఇక ఈ సినిమా షూట్ కేరళలో నిన్న స్టార్ట్ అయ్యింది.

అయితే రెండవ రోజు షూటింగ్ స్పాట్ లో జరిగిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట ఆకట్టు కుంటున్నాయి.

షూటింగ్ స్పాట్ కు భారీగా అభిమానులు తరలివచ్చి తలైవా అంటూ నినాదాలు చేస్తూ అక్కడ హంగామా చేసారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అలాగే సూపర్ స్టార్ ఈ షూటింగ్ లో మరింత యంగ్ లుక్ లో ఆకట్టు కుంటున్నారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఈయన లుక్ చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) తో పాటు రానా దగ్గుబాటి కూడా బాగా అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు