Rajinikanth Latha: అందుకే నువ్వు గ్రేట్ బాసు..రజిని మాటలకూ భార్య లత కన్నీరు

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక వీడియో వైరల్ గా మారుతుంది.

తమిళం లో మాట్లాడుతున్న స్ప్రష్టం గా రజినీకాంత్( Rajinikanth ) బాషా మనకు అర్ధం అవుతుంది.

అసలు ఆ వీడియో సారాంశం ఏమిటి అంటే రజినీకాంత్ మాటల్లోనే చదవండి.నేను రోజుకు రెండు సార్లు మాంసాహారం లేకుండా భోజనం చేయాలను.

అందులో మరి ముఖ్యంగా మటన్ ఖచ్చితంగా ఉండాలి.ప్రతి రోజు ఉదయమే పాయ మరియు చికెన్ 65 ఎదో ఒక టైం సపరేట్ గా తింటాను.

ఎన్ని సిగరెట్ ప్యాకెట్స్ కాల్చుతానో నాకే లెక్క తెలియదు.షూటింగ్ అయిపొయింది అంటే చాలు విపరీతంగా మద్యం తాగుతాను.

Advertisement

శాకాహారుల్ని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది.అసలు ఆ గడ్డి ఎలా తింటారు అని ఒకటే బాధ ఉంటుంది.

పాపం ఇదేం ఖర్మరా బాబు వాళ్లకు.

ఇక డెడ్లీ కాంబినేషన్ అంటే సిగరెట్ + మందు + మాంసం. ఈ మూడు ఎంతో ప్రమాదకరం.కానీ ఈ మూడు లేనిదే నా జీవితంలో ఒక్క రోజు కూడా ఉండేది కాదు.

అంటూ చాల ఫన్నీ గా రజినీకాంత్ ప్రసంగం సాగింది.ఈ వయసు లో నేను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి, నేను ఇప్పటి వరకు చెప్పిన డెడ్లీ కాంబినేషన్ నుంచి బయటపడటానికి ముఖ్య కారణం నా భార్య లత( Latha Rajinikanth ) అని చెప్పగానే ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

ఏ స్టార్ హీరో లేదా మాములు నటుడు ఇలా తనకు ఉన్న దురలవాట్ల( Bad Habits ) గురించి ఎక్కడైనా, ఇంటర్వూస్ లేదా స్టేజి పైన చెప్పడం విన్నారా లేదా చూసారా,.? అది ఒక్క రజినీకాంత్ కి మాత్రమే సాధ్యం.

Advertisement

అతడు మాత్రమే తనలోని లోపాలను సైతం బయటకు చెప్పడానికి ఎలాంటి మొహమాటం పడడు.పైగా భార్య లతను ఎంతో పొగిడాడు.అందుకే రజినీకాంత్ లాంటి నటులు చాల గ్రేట్.

ఇక చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొని విడిపోయే ఈ రోజులో ఎన్నో అవలక్షణాలు ఉన్న వ్యక్తిని ఇలా అందరు మెచ్చుకునే స్థాయిలో మలచడానికి ఆ మహా ఇల్లాలు ఎంత కష్టపడిందో మాటల్లో చెప్పడం కుదరదు.డబ్బు వుంది కదా అని ఈ రోజుల్లో ఎవరు అణిగిమణిగి ఉండటం లేదు.

రజిని ని చేదు అలవాట్లకు దూరం చేసి ఒక మహాయోగిని చేయడం లో లత నిజంగా సక్సెస్ అయ్యారు.

తాజా వార్తలు