తలైవా 170 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్.. సినిమా అలా ఉండబోతుందా?

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ప్రస్తుతం ఏడుపదుల వయసులో ఉన్నప్పటికీ ఈయన మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా( Jailer ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన తదుపరి సినిమా లాల్ సలామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమాకు స్వయంగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇకపోతే రజనీకాంత్ తన 170వ సినిమాను ఇదివరకే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.సూర్య హీరోగా నటించిన జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ ( TJ Gnanavel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రానా( Hero Rana Daggubati ) కూడా బాగా పోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ ఈ సినిమా గురించి కీలక అప్డేట్స్ విడుదల చేశారు.

రజనీకాంత్ తన 170 వ సినిమా( Rajinikanth 170 ) గురించి మాట్లాడుతూ నేను జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోయే ఈ సినిమా సామాజిక సందేశం తో కూడిన భారీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.అయితే ఇప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏ విధమైనటువంటి టైటిల్ నిర్ణయించలేదు మరొక రెండు రోజులలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని ఈయన తెలిపారు.ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి రాబోతుందని రజనీకాంత్ తెలియజేశారు.

ఇలా రజనీకాంత్ ఈ సినిమా గురించి ఇచ్చిన అప్డేట్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిందని చెప్పాలి.ఇలా సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు చేయడంలో దర్శకుడు జ్ఞానవేల్ దిట్ట అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు