రజినీ ఫ్యాన్స్‌ దెబ్బకు ఆ ఇద్దరికి తడిచిందట

తమిళనాడులో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు అభిమానులు ఉన్నారు.

రజినీకాంత్‌ను చిన్న మాట అన్నా లేదంటే విమర్శించినా కూడా ఆయన అభిమానులు ఊరుకోరు.

సోషల్‌ దాడులతో పాటు బౌతిక దాడులకు కూడా సిద్దం అవుతారు.రజినీకాంత్‌పై ఏ చిన్న మాట కూడా పడనివ్వని వారు తాజాగా ఒక సినిమా ట్రైలర్‌లో రజినీకాంత్‌ను అవహేలన చేస్తున్నట్లుగా వచ్చిన ఒక సీన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

దాంతో ఆ సీన్‌ను సినిమాలో లేకుండా చేస్తామంటూ నిర్మాత మరియు దర్శకుడు మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటించాల్సి వచ్చింది.

కోమలి అనే చిత్రం జయం రవి హీరోగా తెరకెక్కింది.ఒక బాలుడు కోమాలోకి వెళ్లి 16 తర్వాత మళ్లీ కోమా నుండి బయటకు వస్తాడు.ఆ వ్యక్తి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది.

Advertisement

ఇంకా కూడా తాను ఆ కాలంలోనే ఉన్నాను అంటూ బ్రమ పడుతూ ఉంటాడు.చెన్నై నగరం మరీ ఇంతగా ఎలా అయ్యిందని, స్మార్ట్‌ ఫోన్‌ చూసి విచిత్రంగా ప్రవర్తించడం ఇంకా పలు రకాల కామెడీ సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించడం జరిగింది.

ట్రైలర్‌లో రజినీకాంత్‌ షాట్‌ కూడా వేశాడు.

16 ఏళ్ల క్రితం నుండి రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానంటూనే ఉన్నాడు.రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానంటూ అప్పటి నుండి ఇంకా చెబుతూనే ఉన్నాడా అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేశారు.దాంతో రజినీకాంత్‌ను అవమానించినట్లుగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.దాదాపుగా 20 ఏళ్లుగా రజినీకాంత్‌ రాజకీయాల గురించి చర్చ జరుగుతూనే ఉంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

కాని ఆ విషయాన్ని సినిమాలో చూపించడంతో ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు.దాంతో దర్శక నిర్మాతలను టార్గెట్‌ చేసి ట్రోల్స్‌ చేయడం మొదలు పెట్టారు.

Advertisement

ఆగస్టు 15న సినిమాను ఎలా విడుదల చేస్తామో చూస్తాం అంటూ హెచ్చరించారు.దాంతో సినిమా నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది.

ఆ సీన్స్‌ కూడా తొలగిస్తామన్నారు.మరి ఫ్యాన్స్‌ ఇప్పుడు అయినా కూల్‌ అవుతారో చూడాలి.