రజనీకాంత్ ఆ సినిమా చేయడమే పెద్ద తప్పు.. మండిపడుతున్న స్టార్ డైరెక్టర్..

సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) కి భారతదేశ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మన ఇండియాలోనే కాకుండా అతడి క్రేజ్ ఖండాంతరాలు దాటింది.

ఈ స్థాయికి రావడానికి రజనీకాంత్ ఎంతో కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు.అవమానాలు, ఇండస్ట్రీలో ఇతర హీరోల నుంచి ఎదురయ్యే పోటీ, వంటివన్నీ ఎదురొడ్డి చివరికి అగ్ర హీరో అయిపోయాడు.

ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ కి అనుగుణంగా తనని తాను తీర్చిదిద్దుకుంటూ ఇప్పటికీ హిట్స్ అందుకుంటున్నాడు రజనీకాంత్.కొత్త దర్శకులు నేటి తరం ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు.

అలాంటి సినిమాల్లో కూడా చాలా అద్భుతంగా నటిస్తూ అలరిస్తున్నాడు ఈ సూపర్ స్టార్.ప్రస్తుతం "వెట్టయన్" సినిమాలో( Vettayan ) హీరోగా చేస్తున్నాడు.

Advertisement
Rajinikanth Did Wrong , Superstar Rajinikanth , Vettayan, T.J. Jnanavel, K.S. R

T.J.జ్ఞానవేల్ ( T.J.Jnanavel )డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌లో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.రూ.300 కోట్ల బడ్జెట్ తో ఇది తెరకెక్కుతోంది.74 ఏళ్ల వయసులోనూ ఇంత పెద్ద సినిమాలో రజనీకాంత్ సోలో హీరోగా నటించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన దసరా పండగ సందర్భంగా రిలీజ్ కానుంది.

అంటే రేపే ఈ మూవీ థియేటర్లలోకి వస్తోంది.ఈ నేపథ్యంలో రజనీకాంత్ చేసిన ఒక సినిమా గురించి చర్చ మొదలయ్యింది.

Rajinikanth Did Wrong , Superstar Rajinikanth , Vettayan, T.j. Jnanavel, K.s. R

రజిని ఆ సినిమా అనవసరంగా చేశాడని విమర్శలు కూడా చేస్తున్నారు.ఆ సినిమా మరేదో కాదు "లింగా". కె.ఎస్.రవికుమార్ ( K.S.Ravikumar )దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క నటించారు.ఇందులో జగపతిబాబు( Jagapathi Babu ) కూడా ఒక మంచి క్యారెక్టర్ పోషించాడు.ఇందులో రజనీకాంత్ చాలా జోకులు పేలుస్తూ బాగా నవ్వించాడు.

కానీ అత్యంత ముఖ్యమైన కథే చాలా చెత్తగా ఉంది.ఈ సినిమా స్టోరీ లైన్ చాలా వీక్ గా ఉండటమే కాదు క్లైమాక్స్ కూడా బాగా సాగదీశారు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

టీవీలో చూడ్డానికి బాగానే టైం పాస్ అవుతుంది కానీ థియేటర్ కి వెళ్లి ఇలాంటి బోరింగ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.అందుకే అది ఫ్లాప్ అయ్యింది.

Advertisement

స్క్రీన్ ప్లే కూడా బాగా లేకపోవడంతో ఫస్ట్ షో నుంచే దీనికి డిజాస్టర్ టాక్ వచ్చింది.

ఈ సినిమా వచ్చి ఇప్పటికే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇలాంటి సమయంలో కె.ఎస్ రవికుమార్ దీని గురించి కొన్ని సన్సేషనల్ కామెంట్స్ చేశాడు.ఈ సినిమాలో రజనీకాంత్ ని యాక్ట్ చేయించడం వల్లే అది ఫ్లాప్ అయ్యింది అన్నట్టు అతను కామెంట్లు చేశాడు.

రజనీకాంత్ ఆ సినిమా చేయడమే పెద్ద తప్పు, లేకపోతే అది హిట్ అయి ఉండేదేమో అని ఉన్నట్లు అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడాడు.దాంతో రజనీ ఫ్యాన్స్ అతనిపై విరుచుకుపడుతున్నారు.

ఈ సినిమా స్టోరీనే బాగోలేదని అంటున్నారు.

తాజా వార్తలు