రజనీకాంత్ ( Rajinikanth ) ఏంటి.సీఎం కి భయపడి సినిమా చేయకుండా పారిపోవడం ఏంటి.
అని ఈ విషయం తెలిసి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ.అయితే అది నిజమేనండి.మీరు వినేది వింటున్నది నిజమే.
ఎందుకంటే ఆ సినిమా చేయమంటే రజనీకాంత్ తమిళనాడు సీఎం కి భయపడి నేను చేయను బాబోయ్ అని చేతులెత్తేసారట.ఆ సినిమా ఏంటి.
అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.శంకర్ ( Shankar ) దర్శకత్వంలో ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.రోబో( Robo ), రోబో 2.0, జీన్స్, ప్రేమికుడు,అపరిచితుడు, ఐ, ఒకే ఒక్కడు వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో వచ్చాయి.అయితే ఈ సినిమాలన్నింటిలోకెల్లా ఒకే ఒక్కడు ( Oke okkadu ) సినిమా చాలా స్పెషల్.
ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో వివాదాలు వచ్చాయట.
మరీ ముఖ్యంగా ఈ సినిమా తమిళనాడు సీఎం ( Tamilanadu Cm ) కి వ్యతిరేకంగా రావడంతో చాలామంది భయపడ్డారు.కానీ శంకర్ మాత్రం చాలా ధైర్యంగా ఈ సినిమా తెరకెక్కించారు.ఈ కథ అమెరికన్ టీవీ రిపోర్టర్ అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఆధారంగా రాసుకున్నారు.
అయితే ఈ సినిమాలో ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి.
ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే విషయాన్ని బేస్ చేసుకుని కథ రాసుకొని అన్ని విషయాలు హైకోర్టు జడ్జిని కలిసి తెలుసుకున్నారట శంకర్.అయితే ఈ సినిమా కథ ముందుగా రజినీకాంత్ తో తీయాలి అని శంకర్ భావించారట.కానీ ఈ స్టోరీ చెప్పడంతోనే రజినీకాంత్ ( Rajinikanth ) ఈ కథ కాస్త తమిళనాడు సీఎం కి ఆపోజిట్ గా ఉన్నట్లు అనిపిస్తోంది.
ఈ సినిమాలో చేస్తే నాకు తర్వాత ఎన్ని అవాంతరాలు వస్తాయో నేను చేయను బాబోయ్ అని ఈ మూవీ రిజెక్ట్ చేశారట.ఆ తర్వాత విజయ్,కమల్ హాసన్, టాలీవుడ్ హీరో వెంకటేష్ వంటి వాళ్లకి చెప్పిన కూడా ఫలితం లేకపోవడంతో చివరికి అర్జున్ తో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు శంకర్( Shankar).
ఈ సినిమాలో పాటలు,కాన్సెప్ట్ చాలా బాగుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడంతో అప్పట్లోనే ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy