మా అమ్మ మళ్లీ చనిపోయింది.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్(rajendra prasad) కుమార్తె గాయత్రి తాజాగా మరణించిన విషయం తెలిసిందే.

గుండెపోటుతో ఆమె మరణించడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ కూతురి మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు రాజేంద్రప్రసాద్‌ దంపతులకు కుమార్తెతోపాటు కుమారుడు బాలాజీ ఉన్నారు.

గాయత్రికి(Gayatri) ప్రైవేటు ఉద్యోగి రాజ్‌ కుమార్‌తో వివాహం కాగా వారికి కుమార్తె సాయి తేజస్వి కూడా ఉంది.

Rajendra Prasad Emotional Video Going Viral, Rajendra Prasad, Emotioanl Video, T

గాయత్రి అంత్యక్రియలు కేపీహెచ్‌బీలోని(KPHB) కైలాసవాసంలో ఆదివారం నిర్వహించారు.ఈ క్రమంలో తన కుమార్తె మరణం రాజేంద్రప్రసాద్ తీవ్రంగా కలిచి వేసింది.కూతురు మరణం నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించేందుకు ఇండస్ట్రీ నుంచి పలువురు నటులు ఆయన ఇంటికి వెళ్ళారు.

Advertisement
Rajendra Prasad Emotional Video Going Viral, Rajendra Prasad, Emotioanl Video, T

అలనాటి నటి రమాప్రభతో (Ramaprabha)పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ ను నిన్న కలసిన సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది.

పంపించేసి వస్తా అని వారితో చెబుతూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు రాజేంద్రప్రసాద్.

Rajendra Prasad Emotional Video Going Viral, Rajendra Prasad, Emotioanl Video, T

వారు ఆయనను ఓదార్చారు.ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో చూసిన వారంతా ఆయనకు సానూభూతిని చెబుతున్నారు.అలాగే గతంలో ఒక సినిమా ఈవెంట్లో తన కూతురి గురించి స్పందిస్తూ తన తల్లి చనిపోయారని తన తల్లిని తన కూతురిలో చూసుకుంటున్నట్లు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు