చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆ గుడిలో అమ్మ ఉందని చెప్పారు.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో కామెడీ ప్రధాన సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు.

రాజేంద్ర ప్రసాద్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ఆయన ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

సీరియస్ రోల్స్ లో సైతం నటిస్తూ ఆ పాత్రలకు రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు.తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా ప్రోమో రిలీజ్ ( Suma Adda promo release )కాగా ఈ ప్రోమోలో రాజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

#కృష్ణారామా ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా షోలో మాట్లాడుతూ నా చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారని నేను మూడు నెలల పాటు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ కు వెళ్లానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఆ సమయంలో నన్ను కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఉండదురా అమ్మ.ఇక్కడే ఉంటుంది అని చెప్పారని చెబుతూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

దసరా పండుగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్ లో #కృష్ణారామా సినిమా( Krishnarama movie ) స్ట్రీమింగ్ కానుంది.అక్టోబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#కృష్ణారామా ఈటీవీ విన్ యాప్( ETV win app ) లో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ ఎక్కువగా నటించారు.రాజేంద్ర ప్రసాద్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రాజేంద్ర ప్రసాద్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు భావిస్తున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు