ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు: రాజీవ్ కనకాల 

ఎన్టీఆర్‌(Jr NTR), రాజీవ్‌ కనకాల(Rajeev Kanakala ) మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే.

ఇప్పుడంటే ఎన్టీఆర్‌ షూటింగ్స్‌, ఫ్యామిలీతో బిజీ అయ్యాడు కానీ ఒకప్పుడు మాత్రం ఎన్టీఆర్ తరచూ తన స్నేహితులతో కలిసి వారందరితో సరదాగా గడిపేవారు అంటూ పలు సందర్భాలలో ఆయన స్నేహితులు తెలిపారు.

ఇకపోతే ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు అయినటువంటి వారిలో రాజీవ్ కనకాల ఒకరు.వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈయన కోసం ఒక పాత్ర కచ్చితంగా ఉంటుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా రాజీవ్ కనకాల హోమ్ టౌన్ (Home Town)అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.స్టూడెంట్‌ నెంబర్‌ 1(Student number 1) సినిమా షూటింగ్‌ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

Advertisement

మొదట్లో సార్‌ సార్‌ అంటూ మాట్లాడేవాడు.ఓ సారి నేనే సార్‌ వద్దులే రాజీవ్‌ అని పిలువు చాలు అని చెప్పాను మరుసటి రోజు సెట్ లోకి రాగానే రాజీవ్  అంటూ పిలిచారు.

అలా పిలవగానే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను అయినా నేనే కదా అలా పిలవమన్నది అని చెప్పి మౌనంగా ఉన్నాను.ఇక మరుసటి రోజు రాజీవ్ గారు అని పిలవడంతో నేను షాక్ అయ్యాను.ఏంటి ఇలా పిలుస్తున్నారు అయినా పర్లేదులే గారు అని పిలుస్తున్నారు కదా అని కాస్త సంతోషపడ్డాను.

ఈ సినిమా ఇంటర్వెల్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఒక బిల్డింగ్ పై ఉన్నారు.నేను అలా నడుచుకుంటూ వెళున్నాను.బిల్డింగ్ పైనుంచి ఎన్టీఆర్ ఒరేయ్ రాజా అంటూ గట్టిగా పిలిచారు.

ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను ఏంటి అలా పిలిచావంటే ఫ్రెండ్స్ అంటే అలా అనరా అంటూ మాట్లాడారు.ఓసారి మేమిద్దరమే ఉన్నప్పుడు ఓ విషయం షేర్ చేసుకొని కాస్త ఎమోషనల్ అయ్యాము.

నిద్రించే ముందు పొర‌పాటున కూడా చేయ‌కూడ‌ని మూడు త‌ప్పులు ఇవే!

  అలా రెండు వారాలకే మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడిందని తెలిపారు.ఇక తారక్ నాకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నోడని రాజీవ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు