Director Shaji N. Karun : తండ్రి ఆవేదన ఒక సీఎం పోస్ట్ ని సైతం ఊడగొట్టింది... 1977 - ఒక ఎమర్జెన్సీ - ఒక లాకప్ డెత్

ఒక రెండేళ్ల కాలం పాటు కొనసాగిన ఎనర్జెన్సీ భారత దేశంలో ఎన్నో విషయాలకు వేదిక అయ్యింది.మరెన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది.

అదే సమయంలో జరిగిన ఒక లాకప్ డెత్ దేశాన్ని కుదించివేసింది.ఒక ముఖ్య మంత్రిని పోస్ట్ నుంచి ఊడగొట్టింది.

అది జరిగింది 1977 లో.ఇదే కథను సినిమాగా తీస్తే జనాలు గుండెలను మెలిపెట్టి కన్నీళ్లు పెట్టించాయి.ఒక సినిమా తీస్తే నితామాతకు డబ్బు మాత్రమే కాదు ఒక సామజిక ప్రయోజనం ఉండాలి అని నమ్మిన దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఈ ఉదంతం సినిమా తీసాడు.కేరళలో జరిగిన ఈ ఘటన రాజన్ కేసు గా అప్పట్లో బాగా పరిచయమే.

ఎమర్జెన్సీ టైం లో ఎందరో ప్రాణాలు, వారి హక్కులు హరించుకపోయాయి.అదే సమయంలో రాజన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకెళ్లి రాక్షసంగా కొట్టి లాకప్ డెత్ చేసారు.

Advertisement

కానీ అతడు బ్రతికి ఉన్నాడో లేడో తెలియని అతడి తల్లిదండ్రులు చేసిన యుద్ధమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఘటన .రాజన్ సంఘటనను మలయాళ చిత్ర పరిశ్రమ సైతం ముక్త కంఠం తో స్పందించింది.చనిపోయాడు అని తెలియక చేసిన ఈ యుద్ధంలో ఆ తల్లిదండ్రులకు మిగిలింది ఆవేదన మాత్రమే.

రాజన్ తండ్రి పేరు T.V.Eachara Warrier .57 ఏళ్ళ వయసులో తన కొడుకు కోసం అయన ఎందరో ఆఫీసర్ల చుట్టూ తిరిగాడు.ఎక్కని ఆఫీస్ దిగని నాయకుడి ఇల్లు లేదంటే నమ్మండి.

చివరికి ఎమ్మెల్యే లు, మంత్రులు, ముఖ్య మంత్రి, ప్రధాని, రాష్ట్ర పతి కి కూడా లేఖలు రాసిన ప్రయోగానం లేదు.

చివరకు తన కొడుకు కోసం కేరళలో తొలిసారి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసింది కూడా అతడి తండి కావడం విశేషం.కోర్ట్ అతడిని ఎక్కడ ఉన్న తెచ్చి కోర్ట్ లో ప్రవేశ పెట్టాలి అని చెప్పిన పోలీసులు తేలేదు.అసలు లాకప్ ఏనాడో చంపి పాతేసిన వ్యక్తిని ఎలా తెస్తారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అందుకే ఎన్నో అబద్దాలు చెప్పి కప్పి పుచ్చని చుసిన ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణం గా అప్పటి ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేసాడు.

Advertisement

ఇక రాజన్ కేసు గా దేశం అంత అతడి గురించే మాట్లాడింది.పిరవి అనే పేరుతో కరుణ్ సినిమా తీస్తే ఎంతో పెద్ద సినిమాగా అవతరించింది.

ఈ సినిమాలో కొడుకు కోసం అల్లాడే తండ్రి పాత్రలో ప్రేమ్ జి నటించగా ఆయనకు ఉత్తమ జాతీయ అవార్డు లభించింది.నటి అర్చన సైతం ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.

ఎంతో దైర్యంగా ప్రజల ముందు ఈ సినిమాను దర్శకుడు ఎంతో సహజం గా తీసి పెట్టారు.కొడుకు కోసం వెతికి వెతికి అలసి సొలసి చివరికి మతి భ్రమించిన తండ్రి పాత్ర ఎందరినో కదిలించింది.

ఇక కేరళలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అంటూ ప్రపంచానికి రాజన్ తండ్రి తెలియచేసారు.ఒరు అచ్చంటె ఓర్మక్కురిప్పుకల్(ఒక తండ్రి జ్ఞాపకాలు) అనే పేరుతో బుక్ కూడా రాసారు.

ఇంగ్లీష్ లో సైతం ఈ బుక్ అనువాదం అయ్యింది.అయినప్పటికీ లాకప్ డెత్ అనే పరంపర ఇప్పటికి కొనసాగుతుంది.

ఇలా తమ బిడ్డలను, భార్యలను, భర్తలను కోల్పోయిన ఎందరికో న్యాయం కూడా దొరకడం లేదు.

తాజా వార్తలు