ఆర్ఆర్ఆర్ మరోసారి సెన్సేషన్.. టాప్ లోకి వచ్చేసిందిగా..

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు నాలుగేళ్ళ పాటు నిరీక్షించారు.మరి అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Advertisement

బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.ఇక ఈ సినిమా ఇక్కడే కాదు.

వరల్డ్ వైడ్ గా కూడా మంచి హిట్ అయ్యింది.ఇన్ని రికార్డులు సాధించిన ఈ సినిమా ఇంకా ఏదొక విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటి రిలీజ్ కూడా అయ్యింది.ఓటిటిలో రిలీజ్ అయ్యాక మరింతగా ఆడియెన్స్ ను ఆకట్టుకుని నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది.

ఇక తాజాగా ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో నిలిచింది.మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా టాప్ 10ట్రెండింగ్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈ సినిమా 19వ వారంలో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.వరల్డ్ వైడ్ గా టాప్ 10 లో నిలవడంతో ట్రిపుల్ ఆర్ మరోసారి వార్తల్లో నిలుస్తుంది.ఇది టాప్ లో నిలవడానికి కారణం ఈ సినిమా తెలుగు వర్షన్ ను రాజమౌళి సమక్షంలో లాస్ ఏజెంల్స్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్పెషల్ స్క్రీనింగ్ వేయడమే అని మేకర్స్ కూడా గర్వంగా చెబుతున్నారు.

Advertisement

ఇలా ట్రిపుల్ ఆర్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.