మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. రికార్డ్ అంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైనా ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి మన అందరికి తెలిసిందే.

జక్కన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నారు.

అయితే జక్కన్న ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒకదానిని నుంచి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ఇకపోతే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు,( Mahesh Babu ) దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇటీవ‌ల ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ఆ షెడ్యూల్ తరువాత మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ టూర్ కు వెళ్లారు.

రీసెంట్ గానే మళ్లీ ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టి ఇప్పుడు షూట్‌ లో పాల్గొనేందుకు సిద్ధ‌మ‌య్యాడు.హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో కంటీన్యూగా ఒక నెల రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.అయితే ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కుతుండగా, మూవీ కోసం రాజ‌మౌళి భారీ రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

సాధార‌ణంగా రాజ‌మౌళి స్టార్ హీరోలను మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా రికార్డ్ సృష్టిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆయ‌న మ‌హేష్ బాబు సినిమాకు 200 కోట్ల రూపాయల వరకు తీసుటున్నట్లు ఐఎండీబీ కూడా ఒక ప్రకటనలో తెలిపింది.SSMB29 ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు కంటే రెండింతల భారీ రెమ్యూనరేషన్ రాజమౌళి తీసుకుంటున్నారు అనే వార్త బ‌య‌ట‌కు రాగా, అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు.డైరెక్టర్లు ఈ రేంజ్ లో డబ్బులు అందుకోవడం అన్నది మామూలు విషయం కాదు అంటూ షాక్ అవుతున్నారు.

మామూలుగా ఈ రేంజ్ లో పారితోషికాలు హీరోలు మాత్రమే అందుకుంటూ ఉంటారు.రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్‌( Rajamouli Remuneration ) తో పాటు ఈ మ‌ధ్య సినిమా ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబు సినిమా కోసం కూడా షేర్ తీసుకునే చాన్స్ ఉందంటున్నారు.దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో SSMB 29 ప్రాజెక్ట్ తెరకెక్కుతుండ‌గా, ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా రూపొందుతోంది.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు