భార్య రమాతో కలిసి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్న రాజమౌళి... ఫోటోలు వైరల్!

ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలలో న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు ఒకటి.ఇలాంటి అవార్డు రావడం అంటే మాటలు కాదని చెప్పాలి ఇప్పటివరకు ఇండియాలో ఈ అత్యుత్తమమైన పురస్కారాన్ని ఎవరు కూడా అందుకోలేదు కానీ, ఇలాంటి ఒక గొప్ప అవార్డును అందుకొనే అదృష్టం తెలుగు సినీ డైరెక్టర్ ఎస్.

ఎస్ రాజమౌళికి దక్కిందని చెప్పాలి.తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు.

ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు.ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఈయన అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకి ఎంపికయ్యారు.ఈ అవార్డును అందుకున్న మొదటి ఇండియన్ దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించుకున్నారు.ఇక ఈయన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉంది.

ఆస్కార్ కోసం రాజమౌళి కూడా ఎంతో కృషి చేస్తున్న సమయంలో ఆయనకు న్యూయార్క్ ఫిలిం సర్కిల్ అవార్డు రావడంతో ఆస్కార్ కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇకపోతే న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజమౌళి తన భార్య రమాతో కలిసి ఈ అవార్డును అందుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో రాజమౌళి కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సినీ సెలబ్రిటీలు రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ విషయంపై రాజమౌళి స్పందిస్తూ ఈ సినిమా కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు