రాజమౌళి రామాయణ్.. సోషల్ మీడియాలో దుమ్ములేస్తోందిగా!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా మోషన్ పోస్టర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ఆర్ఆర్ఆర్‌పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.కాగా ప్రస్తుతం రాజమౌళి సోషల్ మీడియాలో ఇండియాలెవెల్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు.

రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి పలుమార్లు చర్చించిన సంగతి అందరికీ తెలిసిందే.కానీ అలాంటి ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలంటే 3 నుండి 4 సంవత్సరాల సమయంలో పడుతుందట.

కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న రామాయణ్ సీరియల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ సీరియల్‌ను ఏకంగా 77 మిలియన్ మంది వీక్షించడంతో దూదర్శన్‌కు కళ్లు చెదిరే టీఆర్పీ రేటింగ్ వచ్చి పడింది.

Advertisement

దీంతో ఇప్పుడు వెండితెరపై రామాయణాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని, దాన్ని తెరకెక్కించగల దర్శకుడు ఒక్క రాజమౌళి అని ప్రేక్షకులు నమ్ముతున్నారు.దీంతో వారంతా రాజమౌళి రామాయణాన్ని తెరకెక్కించాలనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

కాగా రాజమౌళి ఎప్పటికైనా రామాయణాన్ని తెరకెక్కిస్తాడా లేక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని రూపొందిస్తాడా అనేది చూడాలి.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో తారక్,చరణ్ నటిస్తుండగా ఈ సినిమాను వచ్చే జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు