Rajamouli Mahesh Babu Movie : ఆర్ఆర్ఆర్ కు 2 మహేష్ మూవీకి 20.. జక్కన్న ప్లాన్ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

సాధారణంగా రాజమౌళి( Rajamouli ) సినిమాలు అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి.

జక్కన్న సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాజమౌళి సినిమాలలో 90 నుంచి 95 శాతం ఇండియాలోనే షూట్ జరుగుతోంది.ఎంతో అవసరమైతే తప్ప విదేశాల్లో షూట్ చేయడానికి జక్కన్న ఆసక్తి చూపించరు.

ఆర్ఆర్ఆర్ మూవీ( RRR Movie ) షూట్ ఇండియా కాకుండా మరో 2 దేశాలలో జరిగిన సంగతి తెలిసిందే.అయితే మహేష్ మూవీని మాత్రం 20 కంటే ఎక్కువ దేశాలలో షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఆఫ్రికా అడవుల్లో ఈ సినిమాను షూట్ చేయాల్సి ఉండగా మహేష్ బాబు రోల్ కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వ్యక్తి పాత్ర అని సమాచారం అందుతోంది.రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు( Rajamouli Mahesh Babu Movie Budget ) అని టాక్ వినిపిస్తున్నా అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఆ వార్తలను నమ్మాల్సి ఉంటుంది.ఈ సినిమా రిలీజ్ కావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది.లుక్ టెస్ట్ కోసమే రాజమౌళి ఏకంగా నెల సమయం తీసుకున్నారు.8 లుక్స్ ను సిద్ధం చేయగా ఫోటోషూట్ అనంతరం ఒక లుక్ ను ఫైనల్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood ) నుంచి ఈ సినిమాలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాల్సి ఉంది.మరో టాలీవుడ్ సీనియర్ హీరో( Senior Hero ) ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.జక్కన్న సినిమాలో ఛాన్స్ అంటే ఎవరూ వదులుకోరు.

రాజమౌళి గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.రాజమౌళి సినిమా రిలీజైన తర్వాత మహేష్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు