రిలీజ్ తర్వాత రాజమౌళి ప్లాన్ చేంజ్..!

ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అయ్యాక రాజమౌళి తన ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.

సినిమాని ఒక పార్ట్ గా ముగించిన జక్కన్న సినిమాకి సెకండ్ పార్ట్ సిద్ధం చేయాలని రీ థింగ్ చేస్తున్నారని టాక్.

ఆర్.ఆర్.ఆర్ కథ ముగింపు చెప్పారు.అయితే అల్లూరి, కొమరం భీమ్ పాత్రలతో ఎండ్ చేసినా కథని నడిపించడానికి మరో రెండు పాత్రలతో సినిమా చేయాలన్న థాట్ రాజమౌళికి వచ్చిందట.

అందుకే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత సినిమా పార్ట్ 2 చేయాలనే ఆలోచనలో ఉన్నారట.ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.రెండు లైన్ లు కథలు రెడీగా ఉండగా వాటిలో మహేష్ కి ఏది నచ్చితే అది ఓకే చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా పార్ట్ 2 అనగానే ఆడియెన్స్ అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు.ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా ఉన్నా సరే అది మహేష్ సినిమా చేశాక ఉంటుంది కానీ దానికి ముందు ఉండదని స్పష్టంగా అర్ధమవుతుంది.

Advertisement

మొత్తానికి రాజమౌళి తన డిఫరెంట్ ప్లాన్స్ తో ఆడియెన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాడు. మరి నిజంగానే ఆర్.ఆర్.ఆర్ పార్ట్ 2 ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు