కాంట్ర‌వర్సీలేంటి రాజ‌మౌళి..!

బాహుబలి 2 సినిమా రిలీజ్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతొన్న కొద్ది ఆ సినిమాకు సంబంధం ఉన్న ఏదో ఒక అంశం చుట్టూ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ అవుతోంది.

క‌ర్ణాట‌క‌లో బాహుబ‌లి 2 సినిమాను రిలీజ్ చేయ‌నీయ‌మంటూ అక్క‌డ క‌న్న‌డీగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక బాహుబ‌లి సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి బాహుబ‌లి లాంటి గొప్ప సినిమాకు తాను మ్యూజిక్ అందించాన‌న్న అత్యుత్సాహ‌మో ఏమోగాని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎంత పెద్ద వివాదంగా మారాయో తెలిసిందే.కొంద‌రైతే తెలుగు సాహిత్యంలో విలువ‌ల గురించి మాట్లాడే అర్హ‌త కీర‌వాణికి లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స్వ‌యంగా చేసిన ఓ విష‌యం పెద్ద కాంట్ర‌వర్సీగా మారింది.ఈ సినిమాలో శివగామి రోల్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌కు థ్యాంక్స్ చెప్పిన రాజ‌మౌళి ఆమె ఆ రోల్ సూప‌ర్బ్‌గా చేసింద‌ని ప్ర‌శంసించాడు.

ఇక ఈ పాత్ర కోసం ముందుగా మ‌రో న‌టీమ‌ణిని సంప్ర‌దించామ‌ని.అది రాంగ్ అని త‌న‌కు త‌ర్వాత అర్థ‌మైంద‌న్నారు.

Advertisement

ఈ విష‌యంలో ర‌మ్య‌కు తాను క్ష‌మాప‌ణ‌లు చెపుతున్నాన‌ని కూడా రాజ‌మౌళి చెప్పాడు.రాజ‌మౌళి వ్యాఖ్య‌ల్లో ర‌మ్య‌ను పొగ‌డ‌డం క‌న్నా శ్రీదేవిని తిట్టిన‌ట్టు ఉంద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ రోల్‌కు ముందుగా శ్రీదేవిని అనుకున్నారు.త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌ను తీసుకున్నారు.

రాజ‌మౌళి మాట‌ల‌ను బ‌ట్టి ఈ రోల్‌కు శ్రీదేవి కంటే ర‌మ్య‌నే క‌రెక్ట్ అన్న‌ట్టుగా ఉంద‌ని.ఆయ‌న ఇలా కాంట్ర‌వ‌ర్సీగా ఎందుకు మాట్లాడాడ‌ని కొంద‌రు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.

50 వేల కోసం నటుడు రంగారావు మందు మానేసిన ఆ కథ ఏంటో తెలుసా.. ?
Advertisement

తాజా వార్తలు