ఆస్కార్ సినిమాతో ఆదమరిచి నిద్రపోయిన జక్కన్న

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో ఈ వైరస్ నుండి దేశప్రజలను కాపాడేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ విధించారు.

ఈ లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

కాగా ఈ సందర్భంగా ఇళ్లకు పరిమితమైన పలువురు సెలబ్రిటీలు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో తమ సోషల్ ఖాతాల్లో తెలుపుతున్నారు.కాగా ఈ సమయంలో దర్శకధీరుడు రాజమౌళి ఇంట్లో ఉంటూ ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు.

కాగా ఈ క్రమంలో ఆస్కార్ విజేతలుగా నిలిచిన పలు చిత్రాలను ఆయన చూస్తున్నాడట.కానీ ఓ సినిమా మాత్రం ఆయనను ఆదమరిచి నిద్రపోయేలా చేసిందట.

అంటే అది ఆయనకు నచ్చిందని కాదట.ఆ సినిమా పరమ బోరింగ్‌గా ఉందని, అందుకే ఆయన నిద్ర పోయినట్లు తెలిపాడు.

Advertisement

ఆస్కార్ బరిలో విజేతగా నిలిచిన పారాసైట్ చిత్రం ఆయనకు చాలా బోరింగ్‌గా అనిపించిందని తెలుస్తోంది.అయితే ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఈ సినిమాపై జక్కన్న ఇప్పుడు రివ్యూ ఇవ్వడం ఏమిటో అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు