బీజేపీ కాదు తన బలం మీదే రాజగోపాల్ రెడ్డి కి నమ్మకం ? 

త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో,  ఇక్కడ పోరు హారహోరేగా సాగేలా కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్ని మండలాలు , గ్రామాల వారీగా మునుగోడు నియోజకవర్గం అంతా ఇంచార్జిలను నియమించింది.

ఒక్కో నాయకుడికి ఒక్కో గ్రామం అప్పగిస్తూ గడపగడపకు తిరిగే విధంగా అన్ని పార్టీలు ప్లాన్ చేశాయి.ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ మంత్రులు , ఎమ్మెల్యేలను సైతం మండలాల ఇన్చార్జిలుగా నియమించి , ఫలితం తమ వైపు ఉండేలా ప్లాన్ చేసుకుంది.

ఇక బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.కాంగ్రెస్,  టిఆర్ఎస్ లు,  ఇంకా అభ్యర్థిని ఎంపిక చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి.

ఇది ఇలా ఉంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.  బిజెపి ఈ నియోజకవర్గంలో అంత బలంగా లేకపోయినా,  తనను చూసే జనాలు ఓటు వేస్తారనే నమ్మకంతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.

Advertisement

అందుకే ఆయన బిజెపి ప్రభావం కంటే ఈ నియోజకవర్గంలో తన ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అంటూ అనేక సందర్భాల్లో ప్రస్తావించడం బీజేపీ నాయకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు దీటుగా తాను మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తాను అంటూ రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు తప్ప,  బీజేపీని హైలెట్ చేసే విధంగా ఆయన మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 గతంలో జరిగిన దుబ్బాక,  హుజురాబాద్ ఉప ఎన్నికల్లోను ఇదే రకమైన పరిస్థితి ఎదురైంది.వరుస ఓటములు  ఎదుర్కొంటున్న రఘునందన్ రావు తనకు  సానుభూతితో  జనాలు ఓట్లు  వేస్తారని చెప్పుకున్నారు .ఇక ఈటెల రాజేందర్ సైతం  తనకు టిఆర్ఎస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నట్లుగానే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.  ఇప్పుడు మునుగోడు లోను రాజగోపాల్ రెడ్డి అదే విధంగా వ్యవహరిస్తూ ఉండడంతో,  పార్టీ ప్రభావం కంటే తమ వ్యక్తిగత లాభమే ఎక్కువగా ఉందన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తుండడం బిజెపి అగ్ర నాయకులకు సైతం మంట పుట్టిస్తోందట.

   .

నైజాంలో ఆ రికార్డ్ క్రియేట్ చేయనున్న పుష్ప ది రూల్.. బన్నీ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే!
Advertisement

తాజా వార్తలు