తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే మూడు రోజుల్లో వ‌ర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి కర్ణాట‌క వ‌ర‌కు ఉత్త‌ర -ద‌క్షిణ ద్రోణి కొన‌సాగుతోంద‌ని చెప్పింది.

ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల్లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు