దసరా సినిమాలకు భారీ షాకిచ్చిన తుఫాన్.. దేవరపై కూడా ఎఫెక్ట్ పడిందా?

ఎట్టకేలకు దసరా వీకెండ్ ముగిసింది.ఇక ఈ దసరా వీకెండ్ లో భాగంగా చాలా సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ వీకెండ్ లో భాగంగా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.కాగా మూవీ మేకర్స్ తన సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

ఇంకొన్ని రోజుల్లో మౌత్ టాక్ ఇంకాస్త పెరుగుతుందని భావిస్తున్నారు.కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా చేస్తోంది తుపాను.

ఆంధ్రప్రదేశ్ ను మరోసారి తుపాను( storm ) కలవరపెడుతోంది.నెల్లూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిన్నటీ నుంచే వానలు కురుస్తున్నాయి.

Advertisement

మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి.

ఇక తిరుపతి ( Tirupati )చుట్టుపక్కల హై ఎలర్ట్ ప్రకటించారు.ఈ రోజు దక్షిణ కోస్తాలో, రేపు కర్నూలు, కడప ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయింది.

గత రెండు రోజులుగా తుఫాను వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.ఇక ఈ వర్షాల కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు.

అలాగే ఏపీలోని దాదాపు అన్ని మెయిన్ సెంటర్లలో ఇప్పటికే ఆక్యుపెన్సీ తగ్గిపోయింది.విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి సిటీల్లోని థియేటర్లలో జనం కనిపించడం లేదు.

పుష్ప 2 ప్రతి సీనుకి దిమ్మ తిరిగి పోవాల్సిందే.. అంచనాలను పెంచేసిన దేవిశ్రీ!
ఆఫ్టరాల్ రూ.1,500 అంటూ నాగవంశీ తలతిక్క వ్యాఖ్యలు.. బుద్ధి చెబుతున్న నెటిజన్లు..!

విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఇప్పటికే ఫ్లాప్ అయ్యాయి.ఈ భారీ వర్షాలతో ఉన్న కొద్దిపాటి ఆశ కూడా పోయింది.

Advertisement

దసరా సీజన్ లో బాగా నడిచిన దేవర, వేట్టయన్ ( Devara, Vettayan )సినిమాలపై కూడా వర్షాలు ప్రభావం చూపిస్తున్నాయి.వాటికి కూడా ఆక్యుపెన్సీ తగ్గింది.ఇక ఈ వర్షాల వల్ల అతిపెద్ద దెబ్బ సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో ( My nanna superhero )సినిమాకే అని చెప్పాలి.

దీనికి మంచి రివ్యూస్ వచ్చాయి కానీ ఓపెనింగ్స్ లేవు.పాజిటివ్ టాక్ తో జనం ఇప్పుడిప్పుడే పెరుగుతారని యూనిట్ ఆశపడుతోంది.ఏపీలో ఒక 2 రోజుల పాటు ఆశ వదులుకోవడం బెటర్ అని చెప్పాలి.

మరో రెండు రోజుల పాటు తుఫాను కారణంగా ఇప్పటికే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు