వృత్తాకార ఇంద్ర ధనుస్సు.. అద్భుతం అంటున్న నెటిజన్లు

ఇంద్ర ధనుస్సు అనే పేరు మెదలగానే వర్షా కాలంలో బయటి కొచ్చి చూస్తుంటాం.అర్థవృత్తాకారంలో కనిపించే ఆ హరివిల్లును చూసి చిన్నా పెద్దా కేరింతలు కొడతాం.

ఒకవేళ మనం ఏదైనా బొమ్మ గీసినా, అర్ధ వృత్తాకారంలోనే ఇంద్ర ధనుస్సును గీస్తుంటాం.అయితే ఇంద్రధనుస్సు అనేది వృత్తాకారంలో ఉంటుందని చాలా కొద్ది మందికే తెలుసు.

ఇటీవల వృత్తాకారంలో ఉన్న ఓ ఇంద్రధనుస్సుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇంద్రధనస్సు యొక్క వాస్తవ రూపం పూర్తిగా గుండ్రంగా ఉంటుందనే విషయం చాలామందికి తెలిసింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఇటీవల ట్విట్టర్‌లో వండర్ ఆఫ్ సైన్స్ అనే ఖాతా నుంచి ఈ వ‌ృత్తాకార ఇంద్ర ధనుస్సు వీడియో షేర్ చేయబడింది.

Advertisement

ఓ భవనం పై అంతస్తు నుంచి ఈ కనువిందైన వీడియో తీసినట్లు అర్ధం అవుతోంది.సముద్రం ఒడ్డున నిర్మించిన ఎత్తైన భవనం మధ్యలో నుంచి కనిపిస్తున్న ఇంద్రధనస్సు నిజానికి చూడచక్కగా ఉంది.

అయితే విమానం నుంచి దీనిని వీడియో తీసి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఈ వీడియోకు ఇప్పటి వరకు 3.5 మిలియన్ల వ్యూస్ దక్కాయి.ఎప్పుడైనా ఇంద్రధనుస్సు చూశాక అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతుంది.

ఇంద్రధనస్సు తిరుగుతుంటే అందులో సగం మాత్రమే ఎందుకు చూడగలమని అంతా భావిస్తుంటారు.హౌ స్టఫ్ వర్క్స్ అనే వెబ్‌సైట్‌లో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది.దీని ప్రకారం, ఇంద్రధనస్సు యొక్క మొత్తం వృత్తాన్ని మనం చూడలేము ఎందుకంటే అది హోరిజోన్ క్రిందకు వెళుతుంది.

లేదా వెనుక దాగి ఉంటుంది.అందుకే ఇది పూర్తిగా కనిపించదు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

ఈ వైరల్ వీడియోలో కనిపించే ఇంద్రధనస్సు లాంటిది మీరు కూడా మొత్తం చూడాలంటే మీరు కొంత ఎత్తైన ప్రదేశంలో ఉండాలి.

Advertisement