గుంటూరు రైల్వేస్టేషన్‌లో రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌

గుంటూరు: ప్రయాణికులకు బోగీలోనే(రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌) అల్పాహారం, భోజనం అందించే వినూత్న కార్యక్రమాన్ని గుంటూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు.ద.

మ.రైల్వే పరిధిలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్టును చేపట్టారు.

Railway Coach Restaurant In Guntur Railway Station Details, Railway Coach Restau

పాత బోగీని ఎంపిక చేసి గుంటూరు రైల్వేస్టేషన్‌ ఎదుట ఖాళీగా ఉన్న స్థలంలో ఉంచారు.దీన్ని హోటల్‌గా మార్చారు.

బోగీ లోపలికి రాగానే వినూత్నమైన అనుభూతి కలిగేవిధంగా ఆకర్షణీయంగా, ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు.పరిశుభ్రమైన ఆహారంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేస్తున్నారు.

Advertisement

సరసమైన ధరలకే ఇక్కడ వినియోగదారులకు 24 గంటలూ అన్ని రకాల ఆహార పదార్థాలు సరఫరా చేయనున్నారు.బేస్‌ కిచెన్‌లో తయారు చేసిన ఆహార పదార్థాలను బోగీలోకి తెచ్చి వడ్డించనున్నారు.

మండల రైల్వే అధికారి మోహన్‌రాజా ప్రారంభించారు.సీనియర్‌ మండల వాణిజ్య అధికారి ఆంజనేయులుతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

వినూత్నమైన ఆలోచనతో చేపట్టిన ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, ఉద్యోగులను ద.మ.రైల్వే జీఎం(ఇన్‌ఛార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement
" autoplay>

తాజా వార్తలు