Rahul Gandhi Bharat Jodo Yatra : రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఈ పాదయాత్ర రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ"భారత్ జోడో యాత్ర" ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది.

పాదయాత్రలో రాహుల్ తో అడుగులు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఉంటున్నారు.

ఇదే సమయంలో తనతో సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓపికగా.వారి సమస్య వింటున్నారు రాహుల్.

చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరిని ఆకట్టుకునే రీతిలో రాహుల్ గతానికి భిన్నంగా రాణిస్తున్నారు.ఈ క్రమంలో మహారాష్ట్రలో మాలేగావ్ ప్రాంతంలో పర్యటిస్తున్న రాహుల్.

రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ పాదయాత్ర చేపట్టినట్లు సంచలన కామెంట్స్ చేశారు.ఇంధన ధరల పెంపుతో.

Advertisement

రైతులను కేంద్రం కష్టాల్లోకి నెట్టింది అని పేర్కొన్నారు.అగ్ని వీరుల చేత నాలుగేళ్లు పనిచేయించుకుని.

ఆ తర్వాత వాళ్లను జీవితాంతం నిరుద్యోగులుగా మిగిలేలా చేస్తున్నారు.ఇదేం జాతీయవాదం అంటూ కేంద్రాన్ని నిలదీశారు.

 ఇదిలా ఉంటే త్వరలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.పాదయాత్రకి బ్రేక్ చెప్పి ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 
Advertisement

తాజా వార్తలు