Rahul Gandhi: సాయిబాబా లాగే రాహుల్ గాంధీ ఆలోచనలు.. రాబర్ట్ వాద్రా ప్రశంసలు!

కాంగ్రెన్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో రాహుల్‌గాంధీని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసలతో ముంచెత్తారు.

రాహుల్ గాంధీ ఆలోచనా విధానం సేమ్‌ టు సేమ్ సాయి బాబా మాదిరిగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.అయితే ఆలోచనలే కాదని, చూడటానికి కూడా ఒకేలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల దేశంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నారు.రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రే కూడా ఫుల్ టైమ్‌గా రాజకీయాల్లో కొనసాగుతారని రాబర్ట్ వాద్రా చెప్పారు.

సోమవారం సాయిబాబాను దర్శించుకునేందుకు రాబర్డ్ వాద్రా షిర్డీ వచ్చారు.ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.‘దేశ ప్రజలంతా ఒక్కటే.

భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించిన సాయి బాబా ఆలోచనల మాదిరిగానే రాహుల్ గాంధీ ఆలోచనలు ఉన్నాయి.భారత్ జోడో యాత్ర దేశ ప్రజలో పెను మార్పులు తీసుకురానుంది.

ఆ మార్పును మనం అందరం చూడనున్నాం.భారత్ జోడో యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.

రాహుల్ గాంధీతో కాంగ్రెస్ భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది.’ అని పేర్కొన్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు.కాంగ్రెస్‌ను హేళన చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ శక్తివంతమైన పార్టీగా ఎదుగుతోందన్నారు.

Advertisement

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ నేతృత్వంలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నడుం బిగించిందన్నారు.బీజేపీ ఆటలు ఇకపై సాగదని వాద్రా పేర్కొన్నారు.

ఇకపై కాంగ్రెస్ ప్రజల మధ్యే ఉంటూ దేశ భవిష్యత్ కోసం పోరాటం చేయనుందన్నారు.అలాగే ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారని, అతడి సారథ్యంలో కాంగ్రెస్ మరింత ముందుకు వెళ్తుందని వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు